అదేదో సినిమాలో చెప్పిన్నట్లు “గిల్లితే గిల్లించుకోవాలి” అన్న మాట ఇందస్ట్రీలో సరదాగా చెప్పుకునేవారు. కానీ  ఆ తరువాత ఆ మాటలకి అర్ధాలే మారిపోయాయి. ఇప్పుడు ఆ మాటకు చేష్టలు కూడా మారిపోయాయి. కాలం మారింది, పరిస్థితులు మారాయి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కోచ్ పద్ధతులు కూడా పూర్తిగా మారిపోయాయి.ఇప్పుడు టాప్ డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు ఎవ్వరినీ హీరోయిన్లు అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే, ఈ రోజుల్లో హీరోయిన్‌లే ముందుకెళ్లి డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ బ్యాక్‌గ్రౌండ్ గురించి పూర్తిగా తెలుసుకుని, “మేము రెడీ… దేనికైనా రెడీ!” అనే స్థాయికి వెళ్తున్నారు. సినిమా దొరకాలంటే ఏ రేంజ్‌లోనైనా వెళ్లేందుకు వెనుకాడడం లేదట.


ముఖ్యంగా ఇటీవల కాలంలో ఒక స్టార్ హీరోయిన్ గురించి ఘాటు ఘాటు వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. పేరుకు కోలీవుడ్‌కి చెందిన హీరోయిన్ అయినా, తెలుగు ప్రేక్షకులకూ బాగా సుపరిచితురాలు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఈ బ్యూటీ, గతంలో ఒక పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌తో భారీ గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఆమె కెరీర్ ఏ దిశగా వెళ్తుందో అనే సందిగ్ధంలో ఫ్యాన్స్ ఉన్నారు.ఒకప్పుడు పెద్ద సినిమాల ఆఫర్స్ వరుసగా వచ్చాయి. కానీ “నో, నో” అంటూ ఆమె అనేక ప్రాజెక్ట్‌లను రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ నిర్ణయమే కెరీర్‌కు బ్రేక్ అయ్యిందేమో అన్న చర్చ నడుస్తోంది. ఇటీవల ఆమె, గతంలో తనకు ఆఫర్ ఇచ్చిన కొంత మంది డైరెక్టర్లను మళ్లీ స్వయంగా సంప్రదించిందట. “ఇప్పుడు నేను రెడీ… ఏ రకమైన రోల్‌కైనా ఓకే” అంటూ హింట్ ఇచ్చిందని టాక్.



ఇంతేకాదు, తన స్నేహితులైన కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇతర నటీనటులతో కూడా మాట్లాడి, “అవసరం అయితే ఆ దిశగా వెళ్ళడానికి సిద్ధం” అని చెప్పిందట. ఈ వార్తలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.ఇండస్ట్రీలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఒకప్పుడు “గిల్లితే గిల్లించుకోవాలి” అనేవారు. కానీ ఇప్పుడు “అడిగితే పడుకోవాలి” అనే స్థాయికి వస్తోందని సోషల్ మీడియాలో ఘాటు ఘాటుగా మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి. ఇది చూస్తుంటే, సినిమా ప్రపంచం గ్లామర్ వెనుక ఎంత చీకటి ఉందో మరలా అర్థమవుతోంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: