కోలీవుడ్‌లో తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. తన మొదటి సినిమా మానగరంతో ఆకట్టుకున్న లోకేష్, ఖైదీ, మాస్టర్, విక్రం, లియో వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో సౌత్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తనకు ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పరుచుకున్నాడు. కథలో కొత్తదనం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మాస్ ఎలివేషన్స్ అన్నీ కలిపి చూపించే లోకేష్ స్టైల్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇటీవల లోకేష్ తను దర్శకత్వం వహించే ప్రతి సినిమాకి సుమారు రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. అంటే దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ పొందుతున్న దర్శకుల్లో అతను ఒకడన్న మాట. అయితే ఇప్పుడు అతను కొత్త అవతారం ఎత్తబోతున్నాడు అదే హీరోగా. అవును, లోకేష్ కనగరాజ్ నటుడిగా తన మొదటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
మరి ఈ కొత్త ప్రయాణానికి కూడా ఆయన భారీ రేంజ్‌లో అడుగులు వేస్తున్నాడు. సమాచారం ప్రకారం, హీరోగా తన డెబ్యూ సినిమాకే లోకేష్ దాదాపు రూ.35 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నాడట. ఈ మొత్తం ప్రస్తుతం తమిళ పరిశ్రమలో సూపర్‌స్టార్ల స్థాయిలో ఉంటుంది. ఒక డెబ్యూ హీరోకి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడం చాలా అరుదైన విషయం. దీంతో సినీ వర్గాల్లో "లోకేష్ దర్శకుడిగా మాత్రమే కాదు, ఇప్పుడు హీరోగా కూడా కొత్త స్టాండర్డ్ సెట్ చేస్తున్నాడు" అంటూ చర్చలు నడుస్తున్నాయి. అభిమానులు కూడా ఆయన నటన ఎలా ఉంటుందో, ఏ జానర్ సినిమా చేస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద, లోకేష్ కనగరాజ్ ఇప్పుడు దర్శకుడిగా, హీరోగా రెండు మార్గాల్లోనూ కోలీవుడ్‌లో తన సత్తా చాటేలా ఉన్నాడు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి