ఇటీవ‌ల సినిమా ప‌బ్లిసిటీ కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఇక ఇంటర్వ్యూల్లో కొత్త‌ద‌నం కోసం యాంకర్లు, జర్నలిస్టులు ఎప్పటికప్పుడు కొత్త గా ఆలోచిస్తున్నారు. ప్రేక్షకులకు బోర్ కాకుండా కాస్త ఫన్, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ జోడించడం వాళ్ల మెయిన్ ఆబ్జెక్ట్‌. ఈ క్రమంలోనే “ ఫ్రాంక్ కాల్ ” అనే కాన్సెప్ట్‌ చాలామంది ఉపయోగిస్తారు. ఇందులో గెస్ట్‌గా వచ్చిన సెలబ్రిటీ తనకు తెలిసిన మరో సినీ వ్యక్తికి ఫోన్ చేసి, ఏదో ఊహించని విషయం చెబుతూ కొంచెం గందరగోళం సృష్టిస్తారు. ఆ టెన్షన్‌లోంచి వచ్చే రియాక్షన్‌నే ఫన్‌గా మార్చేస్తారు. అయితే ప్రతి సారి ఆ ఫన్ సరదాగా ముగియదు — కొన్నిసార్లు అది పెద్ద సమస్యగా మారిపోతుంది.


ఇటీవల అలాంటి సంఘటనే ఒక సినీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చోటుచేసుకుంది. తన తొలి సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న ఓ యువ దర్శకుడు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడ యాంకర్, “ హీరోకి ఒక ఫ్రాంక్ కాల్ చేద్దాం, కాస్త సరదాగా ఆటపట్టిద్దాం” అని సూచించాడు. దర్శకుడు కూడా ఆసక్తిగా అంగీకరించాడు. హీరోకు ఫోన్ చేసి “మన సినిమా లీక్ అయిపోయింది ” అని చెప్పి సరదాగా ఆటపట్టించాలని ప్లాన్ చేసాడు. అయితే “లీక్” అనే మాట విన్న వెంటనే హీరో పూర్తిగా షాక్ అయ్యాడు. వెంటనే టెన్షన్‌కి గురై, “పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం, ఆ సైబర్ ఆఫీసర్‌ని సంప్రదిద్దాం” అంటూ సీరియస్‌గా స్పందించాడు. దాంతో దర్శకుడు తడబడి పోయాడు.


కంగారు పడుతున్న హీరోని చూసి, “ఇది ఫ్రాంక్ కాల్ సార్‌, సరదాగా చేశాం” అని చెప్పినా హీరో కోపం తగ్గలేదు. “ఇలాంటి విషయాల్లో ఫ్రాంక్ చేస్తారా?” అంటూ వెంటనే కాల్ కట్ చేశాడు. దాంతో దర్శకుడు ఇబ్బందుల్లో పడిపోయాడు. ఎలా సర్దిచెప్పాలో తెలియక చివరికి ప్రొడ్యూసర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆయన వ్యక్తిగతంగా హీరోతో మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పాడు. ఈ ఘటన తర్వాత ఫ్రాంక్ కాల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనే అవగాహన పెరిగింది. ఎందుకంటే కొన్ని ఫ్రాంక్ కాల్స్ సరదాగా ముగిసినా, మరికొన్నివి ఇలా అనుకోకుండా సీరియస్ మలుపు తీసుకుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: