మోస్ట్ బ్యూటిఫుల్ ఆంటీ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి నేషనల్ క్రష్ రష్మిక మందన తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ కి నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల చేశారు.

మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం , అలాగే ఈ మూవీ విడుదల ముందు ఈ సినిమా బృందం వారు ఈ మూవీ గురించి అత్యంత గొప్పగా చెప్పడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు పరవాలేదు అనే స్థాయి టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. 

ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఈ మూవీ బృందం వారు ఒక పోస్టర్ను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 20.4 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఇంత కాలం పాటు కమర్షియల్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న రష్మిక మొదటి సారి నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm