అయితే, ‘పరాశక్తి’ సినిమా రిలీజ్‌కు ముందే శ్రీలీల మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసిందని పరిశ్రమలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఈ కొత్త సినిమాలో కూడా ఆమె శివకార్తికేయన్‌తోనే జోడీ కట్టనుందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వరుసగా అదే హీరోతో మరో సినిమా చేయనున్నారని వినిపించడంతో, ఈ జంటను మరోసారి పెద్ద స్క్రీన్ మీద చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్న ఈ కొత్త సినిమా షూటింగ్ డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. గతంలో సిబి చక్రవర్తి–శివకార్తికేయన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్’ మంచి విజయం సాధించింది. ఆ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, మళ్లీ అదే కాంబోలో వస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌పై సహజంగానే భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలనే ఫైనల్ చేశారా లేదా అనే విషయంపై మాత్రం మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, ఈ వార్తలపై శ్రీలీల ఫ్యాన్స్ మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుసగా అదే హీరోతో సినిమాలు చేస్తే ఆమె క్యారియర్ గ్రోత్‌కు ఇది మైనస్ అవుతుందని అంటున్నారు. “ఎప్పుడూ రిపీట్ హీరోలతోనే సినిమాలు చేస్తూ ఉంటే నీ ఇమేజ్ పడిపోతుంది… కొత్త హీరోస్‌తో ట్రై చేయాలి… వెరైటీ రోల్స్ చేయాలి” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఒకసారి చేసిన హీరోతో మళ్లీ చేయడంలో పెద్దగా కిక్ ఏమీ ఉండదని, కొత్త కాంబినేషన్లే ప్రేక్షకులకు ఫ్రెష్‌గా అనిపిస్తాయని వారు సూచిస్తున్నారు.పరిశ్రమలో ఈ రూమర్లు నిజమా కాదా అనేది రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. కానీ శ్రీలీల ప్రస్తుత గ్రాఫ్‌ను చూస్తే, ఆమెకు కొత్త స్ట్రాటజీ, కొత్త కాంబినేషన్స్, కొత్త జానర్స్ అవసరమనే చర్చ బలంగా వినిపిస్తోంది. ‘పరాశక్తి’ హిట్ అయితే మాత్రం శ్రీలీల కెరీర్‌లో భారీ టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశముంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి