మహాభారతం, రామాయణం వంటి సినిమా కథలు తనకి చాలా ఇష్టమని. తనకు మహాభారతం తెరకెక్కించడం డ్రీం ప్రాజెక్టు అంటూ తెలిపారు. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా, రామాయణం లో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తాననుకోలేదంటూ తెలిపారు. ఈ సినిమా గురించి ఒక్కొక్క సీను రాస్తూ ఉంటే, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షార్ట్ ఊహించుకుంటే ఎక్కడో గాలిలో ఉన్నాననే ఫీలింగ్ ఏర్పడిందని తెలిపారు. మొదటి రోజే మహేష్ బాబు షూటింగ్ కి వచ్చినప్పుడు రాముడు వేషం వేయించి లుక్ టెస్ట్ చేశాను. అద్భుతంగా కనిపించారు మహేష్ బాబు. కానీ ఆ ఫోటోలు ఎక్కడ లీకు కాకుండా ఉండేందుకు జాగ్రత్త పడి డిలేట్ చేశానని రాజమౌళి తెలియజేశారు.
ఈ సినిమాలో మహేష్ బాబు నటన అద్భుతంగా ఉందని, మహేష్ బాబు పాత్ర సినిమాకే హైలైట్ అవుతుందని తెలిపారు. అంతేకాకుండా మహేష్ బాబు నటనను చూసి అభిమానులు ఆశ్చర్యపోయేలా ఉంటుందని తెలియజేశారు. మహేష్ బాబు గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయని మొబైల్ కి దూరంగా ఉంటూ మనుషులకు దగ్గరగా ఉంటారని తెలియజేశారు. తాను ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలలో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని తెలియజేశారు. తన కెరియర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందంటూ కూడా తెలియజేశారు రాజమౌళి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి