టాలీవుడ్లో నటిగా జ్యోతి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈమె ఎక్కువగా కామెడీ సినిమాలలో, అప్పుడప్పుడు బోల్డ్ పాత్రలో కనిపిస్తూ ఉంటుంది. గడిచిన కొన్ని నెలల క్రితం ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యాంగార్ తో కలిసి నటి జ్యోతి చాలా క్లోజ్ గా కనిపించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా జ్యోతి బర్తడే పార్టీకి వచ్చిన శ్రీకాంత్ అయ్యాంగార్ దగ్గరికి తీసుకొని మరి ముద్దు పెట్టినట్టు కొన్ని ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఈ జంట త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ పలు రకాల రూమర్స్ వినిపించాయి.



అయితే ఆ తర్వాత మళ్లీ ఈ విషయం పైన ఏ ఒక్కరు స్పందించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతి, నటుడు శ్రీకాంత్ అయ్యాంగార్ తో పెళ్లిపైన , తన రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. గతంలో తాను చిన్న వయసులోనే వివాహం చేసుకొని ఒక బాబుకి తల్లిని అయ్యానని, కానీ ఆ తర్వాత రెండేళ్లకే విడాకులు తీసుకున్న అప్పటినుంచి సింగిల్ మధర్ గానే ఉన్నానని తెలిపింది. శ్రీకాంత్ అయ్యంగారితో పెళ్లి అనే వార్తలు కేవలం ఫేక్ వార్తలు అంటూ కొట్టి పారేసింది.


నేను బర్తడే పార్టీ ఉంటే అక్కడికి వెళ్లాను అక్కడ ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ సీన్లో నన్ను హత్తుకొని కిస్ చేయాలి.. శ్రీకాంత్ తనని అడిగి అలా చేశారని అలా ఫోటో తీసుకుందాం అంటే ఓకే అని చెప్పాను.. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో  మ్యారేజ్ అంటూ ఏదో పోస్ట్ చేశారు. దీంతో అంత అయిపోయింది చాలామంది ట్రోల్ చేశారు. దీంతో చాలామంది నరేష్, పవిత్ర జంట లాగే మా జంటని కూడా అనుకున్నారు. కానీ అదంతా సినిమా కోసమే జస్ట్ అలా జరిగిందని తెలిపింది జ్యోతి. ఎప్పటికైనా తాను కూడా రెండో పెళ్లి చేసుకుంటానని, అందుకు సరైన పార్ట్నర్  దొరకాలి, నా బాధ్యతలను కూడా తగ్గించుకున్న తర్వాతే రెండో పెళ్లి గురించి ఆలోచిస్తానని తెలిపింది జ్యోతి.

మరింత సమాచారం తెలుసుకోండి: