- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, అమల అక్కినేని హీరోయిన్‌గా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ సినిమా ఎంతటి మైలురాయిగా నిలిచిందో అందరికీ తెలిసిందే. 1989లో విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా కథనాన్ని, టెక్నిక్‌ను, స్టైల్‌ను పూర్తిగా మార్చేసిన నిజమైన గేమ్ ఛేంజర్. యాక్షన్, రియలిజం, నేపథ్య సంగీతం, పాత్రల తీరు, ప్రతి అంశం అడ్వాన్స్ గా ఉండటం వల్ల ‘శివ’ కు ఒక కల్ట్ స్టేటస్ ఏర్పడింది. ఈ లెజెండరీ చిత్రం ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రీరిలీజ్ అయి, మళ్లీ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొత్త సినిమాలు పోటీలో ఉన్నా కూడా ‘శివ’ రీరిలీజ్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన ఓపెనింగ్స్ చూసిన పరిశ్రమ వర్గాలు కూడా షాక్ కి గురయ్యాయి.
నాస్టాల్జియా ఫ్యాక్టర్, నాగార్జున - అమల కెమిస్ట్రీ, ఇళయరాజా సంగీతం, ఆర్‌జివి స్టైల్ అన్నీ కలిసి యువత నుంచి సీనియర్ ఆడియన్స్ వరకు అందరినీ థియేటర్లకు రప్పించాయి. తాజాగా లభించిన సమాచారం ప్రకారం, ఈ సినిమా రీరిలీజ్ రెండు రోజుల్లోనే 3.95 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రీరిలీజ్ సినిమాకు ఇది చాలా పెద్ద నంబర్. ముఖ్యంగా ఓల్డ్ క్లాసిక్ కు ఈ స్థాయి రిపీట్ ఆడియన్స్ రావడం అరుదైన విషయం. వీకెండ్ చేరడంతో మూడో రోజున కూడా ఈ సినిమా మరింత వేగంగా అక్కడక్కడా హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోవడం ఖాయం అని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి.
సినిమాలో శుభలేఖ సుధాకర్, రఘువరన్, జేడీ చక్రవర్తి తదితరులు గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ముఖ్యంగా ఇళయరాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ గూస్‌బంప్స్ తెప్పించేంత ప్రభావం చూపుతుంది. ఈ రీరిలీజ్ ద్వారా ‘ శివ ’ సినిమా కొత్త తరం ప్రేక్షకులకు మరొకసారి పరిచయమవ్వడం, పాతతరం వారికి మధుర స్మృతులను గుర్తు చేయడం జరిగింది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి