దక్షిణ భారత సినీ పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాలుగా తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న సీనియర్ హీరోయిన్ త్రిష, ఇప్పటికీ స్టార్ హీరోలతో సమానంగా పోటీ పడుతూ ఆకట్టుకుంటోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ విశ్వంభర ’ లో త్రిష కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవితో ఆమె కలయిక చాలా కాలం తరువాత జరుగుతున్నందున ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రిష వ్యక్తిగత జీవితం ముఖ్యంగా ఆమె పెళ్లి మరోసారి వార్తల్లోకి వచ్చింది. 41 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్న త్రిష గురించి తరచూ రకరకాల పుకార్లు ప్రచారం అవుతుంటాయి. గతంలో కొంతమంది మీడియాలో త్రిషను కొన్ని ప్రముఖ హీరోలతో అనుసంధానిస్తూ వార్తలు రాసినా .. అవి ఏవీ అధికారికంగా నిర్ధారితం కాలేదు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఆమె స్నేహం గురించి ఓ సమయంలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
విజయ్ పుట్టినరోజు సందర్భంగా బయటకు వచ్చిన ఒక ఫోటో విజయ్ త్రిష పెంచుతున్న పెంపుడు కుక్కపిల్ల ‘ ఇజ్జి ’ తో ఆడుకుంటూ ఉండగా, పక్కనే కూర్చున్న త్రిష సంతోషంగా నవ్వుతుండటం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దాంతో మళ్లీ కొత్త రూమర్లు మొదలయ్యాయి. ఇలాంటి వార్తలకు తాజాగా త్రిష స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు సినిమా పరిశ్రమలో ఎన్నో మంచి స్నేహితులు ఉన్నారని, వారిని కలిసిన ప్రతిసారీ “ పెళ్లి ” తో ముడిపెడుతూ వార్తలు అల్లేయడం చాలా తప్పు అని ఆమె అభిప్రాయపడిందని చెబుతున్నారు. నిరాధారమైన, ఇబ్బంది కలిగించే రూమర్‌లను వ్యాప్తి చేయొద్దని ఆమె విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం త్రిష పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టిందని, ముఖ్యంగా విశ్వంభరతో పాటు ఆమె చేతిలో ఉన్న కొత్త ప్రాజెక్టులు ఆమె కెరీర్‌కు మరోసారి మంచి ముందడుగు కానున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి