అందులో ముఖ్యంగా రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చిన విషయం ఏంటంటే—ఈ సినిమాలో మహేష్ బాబు ‘రాముడు’ వేషంలో కనిపించబోతున్నారు. ఈ విషయం బయటకు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపైంది. రాముడి పాత్రలో మహేష్ కనిపించే సినిమా రాబోతుందన్న ప్రచారం, శ్రీరామనవమి టైమ్‌కి విడుదల అనే సమీకరణ, అన్నీ కలిసి బాక్సాఫీస్‌పై కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.అనుకున్న విధంగా నిజంగానే ఏప్రిల్ 7, 2027 నాటికి సినిమా విడుదలైతే, “వారణాసి” కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్‌లో ఉండడం ఖాయం. పండుగ, అంచనాలు, రాజమౌళి క్రేజ్—అన్ని కలిసి భారీ బాక్సాఫీస్ తుఫాను తట్టడం సినిమా ఇండస్ట్రీకి కూడా పెద్ద ఛాలెంజ్ అవుతుంది.
అయితే ఒక విషయం మాత్రం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. సాధారణంగా రాజమౌళి సినిమాలు ప్రకటించిన సమయానికి పూర్తవ్వడం చాలా అరుదు. ఆయన ఎప్పుడూ క్వాలిటీ విషయంలో రాజీపడరు. స్క్రిప్ట్ నుంచి షూట్ వరకు, గ్రాఫిక్స్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు… ప్రతి విభాగాన్ని అత్యంత శ్రద్ధగా చూసుకుంటారు. ఆ కారణంగా సినిమాలు ఆలస్యంగా రావడం సహజమే.అయితే “వారణాసి” విషయంలో ఆలస్యం లేకుండా పనిచేస్తే మాత్రం, ఇది ఇండియన్ సినీలో ఒక చారిత్రాత్మక రిలీజ్ డేట్ అవుతుంది. కానీ దేని వల్లైనా సినిమా పోస్ట్‌పోన్ అయితే? అప్పుడు అద్భుతమైన రిలీజ్ విండోను కోల్పోయినట్టే అవుతుంది. ఎందుకంటే శ్రీరామనవమి + సమ్మర్ — ఇవి కలిసి వచ్చే సమయం చాలా అరుదు. కాబట్టి ఈసారి రాజమౌళి, మహేష్ బాబు టీమ్ సమయానికి సినిమా పూర్తిచేసి, 2027లో ప్రేక్షకులకు ఒక మహాగ్రంధం అందిస్తే… అది టాలీవుడ్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక భారీ ఈవెంట్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి