ఈ ఈవెంట్ కోసం మూవీ యూనిట్ ఎన్నో రోజులుగా నిశ్చితంగా ప్లాన్ చేస్తూ, పగలు–రాత్రి తేడా లేకుండా కష్టపడి పనిచేసిందని రాజమౌళి స్వయంగా తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వందలాది టెక్నీషియన్లు, వేలాది లైటింగ్ యూనిట్ సభ్యులు, క్రేన్ ఆపరేటర్లు, స్టేజ్ ఆర్టిస్టులు కలిసి దీని కోసం కష్టపడ్డారట. ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ ఏమిటంటే—ఈ ఈవెంట్ ఖర్చు ఎంత అయ్యింది? ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం, ఈవెంట్ మొత్తం ఖర్చు రూ. 20 నుండి 26 కోట్ల మధ్య ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం అంత పెద్ద మొత్తం కాకపోయినా, కనీసం రూ.15 కోట్లకు పైగా ఖర్చు అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే— మహేశ్ బాబు ఎంట్రీ సీన్ కోసం మాత్రమే సుమారు రూ. 50 లక్షలు ఖర్చు చేశారట! స్మోక్ ఎఫెక్ట్స్, హై ప్రెసిషన్ లైటింగ్, స్పెషల్ రిగ్స్, మ్యూజిక్ సింక్రనైజేషన్—అన్నిటికి బాగా ఖర్చు చేశారట. అంతేకాకుండా, ఈవెంట్ జియో మరియు హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయబడింది. లైవ్ రైట్స్ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్స్ కొన్ని కోట్ల రూపాయలు రాబట్టినట్లు టాక్. ఇంకా లైవ్ ప్రసారం జరుగుతున్న సమయంలో వచ్చిన యాడ్స్ ద్వారానే రూ.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చి ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి