సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన కొంత మంది నటీ మణులు పెళ్లి అయిన తర్వాత భర్తలతో కొన్ని మనస్పర్ధలు ఏర్పడడంతో వారితో విడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంత మంది ఒక పెళ్లి జరిగిన తర్వాత భర్తతో మనస్పర్ధలు ఏర్పడ్డాక అతనితో విడాకులు తీసుకొని మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు. ఇక కొంత మంది మొదటి వివాహం లో జరిగిన తప్పులు మరో సారి జరగవు అనే ఉద్దేశం తో రెండో పెళ్లి చేసుకొని అప్పుడు కూడా అదే పొర పాటు జరిగినట్లయితే రెండవ పెళ్లి విడాకులు తీసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు.

ఇకపోతే ఒక నటీ మని ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ముగ్గురితో కూడా విడిపోయింది. తాజాగా మూడవ పెళ్లి కూడా విడాకులు జరిగినట్లు ఆమె ప్రకటించింది. ఇంతకు ఆ నటిమని ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరి ఎవరో కాదు.. మీరా వాసుదేవన్. ఈమె అనేక సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఈమె 2005 వ సంవత్సరం పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న ఈమె తన మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఈమె 2012 వ సంవత్సరం మలయాళ నటుడు అయినటువంటి జాన్ కొక్కెన్ ను వివాహం చేసుకుంది.

ఈ వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఈమె ఇతనితో కూడా 2016 వ సంవత్సరం విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కెమెరామెన్ విపిన్ తో ప్రేమలో పడిన ఈమె 2024 వ సంవత్సరం ఆయనను పెళ్లి చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈమె 2025 వ సంవత్సరం ఆగస్టు నెలలో విపిన్ తో కూడా వినిపోయినట్లు తాజాగా ప్రకటించింది. ఇక ప్రస్తుతం ఆమె జీవితాన్ని ఎంతో ఆనందంగా , ప్రశాంతంగా గడుపుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mv