హమ్మయ్య… ‘తలైవార్ 173’కి డైరెక్టర్ ఎట్టకేలకు దొరికేశాడనే వార్త కోలీవుడ్‌లో సెన్సేషన్ గా మారింది. రజనీకాంత్ – కమల్ హాసన్‌ల కాంబినేషన్‌లో  ప్రాజెక్ట్ ప్రకటించినా అది సినీ ప్రేక్షకుల్లో సృష్టించే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేది. ఇద్దరూ ఇండియన్ సినీ ఇండస్ట్రీకి స్థంభాలు. ఇలాంటి దిగ్గజాలు కలిసి పనిచేస్తున్నారంటే మొదటి రోజు మొదటి షో హంగామా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.ఇప్పటికే కొద్ది రోజుల క్రితం కమల్ హాసన్‌ స్వయంగా ప్రకటించినట్లుగా, తన ప్రొడక్షన్‌లో రజనీకాంత్ నటించబోయే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో కమల్ తెరపై కనిపించకపోయినా, ఆయన నిర్మాణంలో వస్తోంది అన్న  వార్తే ఫ్యాన్స్‌ను ఆకాశానికెత్తింది. ప్రాథమికంగా ఈ చిత్రాన్ని దర్శకుడు సుందర్ సి. తెరకెక్కించనున్నారని అధికారికంగా తెలిపినా, అనుకోని పరిణామంలో సుందర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు.


ఇలా దర్శకుడు తప్పుకున్న తర్వాత ‘తలైవార్ 173’ను ఎవరు తెరకెక్కిస్తారు? అనే ప్రశ్నకు సమాధానం కోసం సోషల్ మీడియా అంతా ఊహాగానాలతో కిక్కిరిసిపోయింది. రజనీకాంత్ మాజీ అల్లుడు  ధనుష్ ఈ చిత్రానికి దర్శకుడిగా రాబోతున్నాడంటూ వార్తలు వినిపించినా.. ఆ రూమర్స్‌ను టీమ్ ఖండించింది. కమల్ హాసన్ కూడా “రజనీకాంత్ సంతృప్తి చెందే కంటెంట్ వచ్చాకే సినిమా మొదలవుతుంది” అని స్పష్టం చేశారు. అందుకే రజనీ స్టైల్‌కు సరిపోయే కథతో పాటు అటువంటి భారీ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేసే దర్శకుడి కోసం నిర్మాణ సంస్థ పెద్ద రేంజ్‌లో వెతకడం ప్రారంభించింది.



ఇప్పుడేమో తాజాగా కోలీవుడ్‌, సోషల్ మీడియా వర్గాల్లో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియకపోయినా, ఈ ప్రాజెక్ట్‌ గురించి వచ్చిన ప్రతి అప్డేట్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. తలైవార్ 173 కోసం కథ–దర్శకుడు ఎంపిక దాదాపు పూర్తయ్యిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.



రజనీకాంత్ లాంటి లెజెండ్–కమల్ హాసన్ లాంటి విజనరీ నిర్మాత–కొత్తగా ఎంపిక చేస్తున్న స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు రామ్ కుమార్ బాలకృష్ణన్. గతంలో ఆయన తెరకెక్కించిన పార్కింగ్ సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు.  కోలీవుడ్‌లో మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే లైన్‌అప్ గా ఈ మూవీ మారిపోయింది. ఇప్పుడు అందరి చూపులు ఒక్కటే— ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది..??

మరింత సమాచారం తెలుసుకోండి: