సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరోయిన్లు అద్భుతమైన రీతిలో కెరియర్ను ముందుకు సాగి స్తూ ఉంటా రు. కొంత మంది ఒకే సంవత్సరం చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం అనేక సినిమాలతో  ప్రేక్షకులను పలకరించిన ముద్దు గుమ్మలలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్లతో పెద్దగా సినిమాలు చేయకపోయినా మీడియం రేంజ్ హీరోల పక్కన మాత్రం అనేక సిని మాలలో నటించి అద్భుతమైన రీతిలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఈ సంవత్సరం ఈ బ్యూటీ కేరిర్ సూపర్ సాలిడ్ జోష్లో కెరియర్ ముందుకు సాగించింది. ఏకంగా ఈమె నటించిన ఆరు సినిమాలు ఈ సంవత్సరం విడుదల అయ్యాయి. మరి అనుపమ పరమేశ్వరన్ నటించిన ఏ ఏ సినిమాలు ఈ సంవత్సరం విడుదల అయ్యాయి అనే వివరాలను తెలుసుకుందాం.

అనుపమ పరమేశ్వరన్ ఈ సంవత్సరం డ్రాగన్ , పరద , కిష్కిందపురి , జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ , ది పెట్ డిటెక్టివ్ , బైసన్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో డ్రాగన్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా అనుపమ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక పరదా సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకోగా , కిష్కిందపురి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే కొన్ని రోజుల క్రితం విడుదల అయిన బైసన్ మూవీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ , ది పెట్ డిటెక్టివ్ సినిమాలు పెద్ద స్థాయి విజయాలను సొంతం చేసుకోలేదు. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం అనుపమ పరమేశ్వరన్ ఆరు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి అందులో కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: