రీసెంట్ టైంలో వరుసగా మాస్ మూవీస్ చేస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్..తన రూట్ మార్చి రొమాంటిక్ టచ్ ఇస్తూ చేసిన  తాజా చిత్రం “ఆంధ్ర కింగ్ తాలుకా”. ఈ సినిమాలో రొమాంటిక్ టచ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తెలుగు హీరో రామ్ పోతినేని. ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్ తన అభిమానుల మధ్య తిరిగి హైప్ క్రియేట్ చేయగలిగాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ స్థాయిలో భారీగా విడుదలైంది. విడుదలకు ముందే ప్రీమియర్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఓవర్సీస్ నుండి వచ్చిన ఫస్ట్ టాక్ కూడా బలంగా ఉన్నందున, సినిమా ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్గా మారిందని చెప్పవచ్చు.


తెలుగు రాష్ట్రాల్లో కూడా షోలు పెద్ద మొత్తంలో పడిపోయాయి. అడిషనల్ షోలు కూడా కొనసాగుతున్నాయి. టిక్కెట్ బుక్‌స్టేట్ రికార్డులు సృష్టించడంలో సినిమా పెద్ద విజయం సాధించింది అని అంటున్నారు సినీ ప్రముఖులు. సోషల్ మీడియాలో ప్రేక్షకులు “బొమ్మలు అద్దిరిపోయింది”, “రామ్ తన ఫ్యాన్స్‌ ఆకలి తీర్చేశాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాకు ప్రధాన హైలైట్ రామ్ యొక్క నేచురల్ యాక్టింగ్ అని ప్రేక్షకులు, క్రిటిక్స్ ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. స్టోరీ పాయింట్ సాధారణంగా ఉన్నప్పటికీ, రామ్ మరియు భాగ్యశ్రీ మధ్య కెమిక్-ఫుల్ కెమిస్ట్రీ సినిమాలో బూస్ట్ ఇచ్చింది.



కథ పెద్దగా న్యూ ఎలిమెంట్స్ లేకపోయినా సినిమా ని ముందుకు తీసుకెళ్లాడు రామ్ పోతినేని.  తన అభిమాన హీరో అంటే పడి చచ్చేంత ఇష్టం ఉన్న రామ్, ఒక దశలో హీరోకి వరుస ఫ్లాఫ్స్ రావడంతో తను కూడా కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తాడు.. ఈ క్రమంలో తన అభిమాని ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకున్న హీరో ఏం చేశాడు ఆ తర్వాత కథ ఏంటి ..  తరువాతి సంఘటనలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథలో జరిగే మలుపులు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచుతాయి. మొత్తానికి, గత కొంతకాలంగా హిట్ల లేని సమయంలో ఈ సినిమా రామ్‌కు తిరిగి విజయం అందించింది. ప్రేక్షకులు, క్రిటిక్స్ అందరు  రామ్ యొక్క నేచురల్ యాక్టింగ్‌ను, స్క్రీన్ ప్రెజెన్స్‌ను ప్రత్యేకంగా పొగిడేస్తున్నారు. సినిమా చూసిన బయటకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రామ్ యాక్టింగ్ గురించే పొగిడేస్తుండటం గమనార్హం..!

మరింత సమాచారం తెలుసుకోండి: