మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమా మొత్తం ఖర్చు సుమారు ₹70 కోట్లు అంటూ తెలుస్తుంది. ఇందులో నటీనటుల, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ ఖర్చులు, ప్రమోషనల్ కార్యక్రమాల ఖర్చులు అన్నీ కలిపి ఉన్నాయి. టీజర్, ట్రైలర్‌లు, పాటలు, మరియు విస్తృత ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమా రిలీజ్‌కు ముందు నుండి హైప్ క్రియేట్ అయింది. టాలీవుడ్ వర్గాల ప్రకారం, సినిమా బిజినెస్ ఇప్పటికే క్రేజీ స్థాయిలో జరుగుతోందని చెబుతున్నారు.
ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹29 కోట్ల వరకూ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిన్నట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాలో గరిష్ట ఆసక్తి చూపుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్‌ల సంఖ్య ప్రదర్శనాత్మకంగా పెరుగుతోంది. అమెరికాలో ఏకంగా 94 సెంటర్లలో 162 షోలకు 2,155 టికెట్లు ఇప్పటికే అమ్ముడై ఉన్నాయి. దీంతో **ఆంధ్రా కింగ్ తాలూకా** అడ్వాన్స్ సేల్స్‌లో 29,863 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం ₹26.62 లక్షల రూపాయలు) వసూలు చేసుకుంది.
ట్రేడ్ పండితులు అంచనా ప్రకారం, సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్స్ మరింత పెరుగుతాయి. ఇప్పటికే ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న రామ్ పోతినేని, ఈ సినిమా ద్వారా మరో బిగ్ బ్లాక్‌బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారని చెప్పవచ్చు. ఈ విజయం కారణంగా **“ఆంధ్రా కింగ్ హవా”** అనేట్యాగ్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇది ఆంద్రా కింగ్ పవర్ అంటూ రామ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి