టాలీవుడ్‌లో నందమూరి నటసింహం బాలకృష్ణమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘అఖండ’ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆ సినిమా ఇంటర్వెల్ బ్లాక్‌ను, క్లైమాక్స్‌ను చూసి మాస్ ఆడియన్స్ పడ్డ ఉన్మాదం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ తాండవం రెట్టింపు స్థాయిలో 'అఖండ 2: తాండవం' రూపంలో రాబోతోంది. బాలయ్య గర్జనను, బోయపాటి విజన్‌ను మళ్ళీ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ కళ్ళల్లో నిప్పులు కక్కుతూ ఎదురుచూస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్, బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. మొదటి భాగంలోనే మ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన ఈ టీం, రెండవ భాగంలో అంతకుమించి అనే రేంజ్ లో సిద్ధమైందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.


థమన్ లీక్.. అభిమానులకు కిక్!
ముఖ్యంగా 'అఖండ' విజయంలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ పాత్ర మరచిపోలేనిది. అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ప్రతి సన్నివేశాన్ని, ముఖ్యంగా ఆ ఐకానిక్ ఇంటర్వెల్ బ్లాక్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్ళిపోయింది. 'జై బాలయ్య' నినాదం థియేటర్లలో మార్మోగేలా చేసింది. మరి ఇప్పుడు 'అఖండ 2' ఇంటర్వెల్ గురించి థమన్ చేసిన ఒకే ఒక్క పోస్ట్.. ఇండస్ట్రీని షేక్ చేస్తోంది! తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో "Emmmm high raaaa babu !! A-K-H-A-N-D-A-I-N-T-E-R-V-A-L ????" అంటూ థమన్ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ఇది కేవలం ఒక ట్వీట్ కాదు, థియేటర్లలో అభిమానులు పగలగొట్టే సీట్ల శబ్దానికి సంకేతం! గతంలో వచ్చిన 'అఖండ 1' ఇంటర్వెల్ బ్యాంగ్ హై కంటే ఇది పదిరెట్లు ఎక్కువ ఉంటుందని థమన్ పరోక్షంగా చెప్పకనే చెప్పేశాడు. థమన్ స్వయంగా ఇంత హై ఇస్తున్నాడంటే, ఇంటర్వెల్ సన్నివేశం ఎలా ఉండబోతోందో ఊహించుకోవచ్చు!



మాస్ ఎలివేషన్ సునామీ గ్యారంటీ!
బోయపాటి మార్క్ ఎలివేషన్, బాలయ్య ఎనర్జీ, దానికి థమన్ అందించే పవర్-ప్యాక్డ్ బీజీఎం.. ఈ మూడూ కలిసి 'అఖండ 2' ఇంటర్వెల్ లో విధ్వంసం సృష్టించడం ఖాయం. తొలి భాగంలో అఘోరా బాలయ్య చేసిన ఊచకోత చూసి ప్రేక్షకులకు పూనకాలు వచ్చాయి. ఇప్పుడు 'అఖండ 2 తాండవం' ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి థమన్ ఇచ్చిన హింట్ చూస్తుంటే, బాలయ్య ఫైట్స్‌లో నెక్స్ట్ లెవెల్ మాస్ ఎలివేషన్, బోయపాటి ట్రేడ్ మార్క్ యాక్షన్ డోస్, థమన్ ట్యూన్స్‌తో థియేటర్ పైకప్పు లేచిపోవడం గ్యారెంటీ! నందమూరి వీరాభిమానులు ఈ ఇంటర్వెల్ సన్నివేశం కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ అభిమానులకి కావాల్సిన కిక్, గూస్ బంప్స్ ఈ ఒక్క ఇంటర్వెల్ బ్లాక్ తోనే దొరుకుతాయని సినీ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ అంచనాలను మరింత పెంచుతూ 'అఖండ 2 తాండవం' డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. థమన్ లీక్ నిజమవుతుందో లేదో, బాలయ్య విశ్వరూపం ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే.. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కు థియేటర్ లో కళ్లార్పకుండా చూడాల్సిందే! మాస్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమైన ఈ చారిత్రక ఘట్టాన్ని చూడాలంటే డిసెంబర్ 4 వరకు వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: