హీరో రామ్ పోతినేని అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. స్టార్ హీరో స్టేటస్ కోసం ఎంతగానో ప్రయత్నం చేసి ఈ మధ్యకాలంలో కాస్త ముందుకు వెళ్లారు. గత కొంతకాలం నుంచి వచ్చిన ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కాస్త మార్కెట్ కోల్పోయినప్పటికీ అభిమానులు మాత్రం ఆయన వెంటే ఉన్నారు. అలాంటి రామ్ పోతినేనికి ఉన్నటువంటి ట్యాగ్ ని అల్లు అర్జున్ కొట్టేసాడని సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతుంది.. అయితే తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రామ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన కెరియర్ ప్రారంభ రోజుల గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.. అందరు ఇప్పుడు ఉస్తాద్ రామ్ పోతినేని అని పిలుస్తున్నప్పటికీ ఈ ట్యాగ్ తనకు వచ్చిన మొదటి ట్యాగ్ కాదని వెల్లడించారు. 

రామ్ చెప్పిన దాని ప్రకారం తన అభిమానులు తొలినాళ్లలో తనకు ఒక ప్రత్యేకమైన ట్యాగ్ ఇచ్చారంటూ సూచించారు. కానీ ఆ ట్యాగ్ ను తర్వాత వాడడం మానేశానని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఒక స్టార్ హీరో ఆ ట్యాగ్ ను వాడారని, అందుకే రామ్ పోతినేని ఆ ట్యాగ్ వాడడం మానేసారని తెలుస్తోంది. రామ్ ఇలా మాట్లాడిన వెంటనే సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది.. రామ్ పోతినేనికి ఉన్న ట్యాగ్ ను వాడుకున్న హీరో ఎవరో కాదు అల్లు అర్జున్ అంటూ చెప్పుకొస్తున్నారు. రామ్ తన కెరియర్ ప్రారంభంలో స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ తో పిలవబడ్డారు. అదే సమయంలో అల్లు అర్జున్ కూడా స్టైలిష్ స్టార్ ట్యాగ్ ఉపయోగించడం మొదలుపెట్టారు.

అందువల్ల రామ్ అల్లు అర్జున్ ట్యాగ్ గురించే మాట్లాడారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ అభిమానులు, మా హీరో వాడుకున్న ట్యాగ్ అది కాదంటూ చెప్పుకొస్తున్నారు. ఇందులో డిఫరెన్స్ ఉందని  "Style Star" Stylish Star" ఒకటి కావంటూ  చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం దీని గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దాంతో కొంతమంది నెటిజన్స్ రామ్ పోతినేని మాట్లాడిన ఒక్క మాట సోషల్ మీడియాలో మంట పెట్టింది అంటూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: