మెగాస్టార్ చిరంజీవి ఈయన గురించి చెప్పాలంటే ఒక్క ఆర్టికల్ సరిపోదు.. ఇండస్ట్రీకి ఏకాకిగా వచ్చి ఇప్పుడు కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలా వచ్చిన చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు. అయితే తెలుగు ఇండస్ట్రీలో  చిరంజీవిని ఇష్టపడే వారు ఎక్కువ మందే ఉంటారు. కానీ ఒక నిర్మాత మాత్రం తన కుటుంబం, తన కూతురు కంటే ఎక్కువగా చిరంజీవిని  ఇష్టపడేవాడు. అలాంటి నిర్మాత చనిపోయే చివరి రోజుల్లో చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆయన ఎవరు ఆ వివరాలు చూద్దాం.. మెగాస్టార్ చిరుతో చిత్రాలు తీయడానికి నిర్మాతలు ఎగబడేవారు.. అప్పట్లో చిరు హీరోగా వస్తున్నాడు అంటే  తప్పకుండా సినిమా హిట్ అవుతుందనే భరోసా ఉండేది. అలా ఇండస్ట్రీలో  చిరంజీవితో ఎక్కువ సినిమాలు తీసిన నిర్మాతల్లో దేవి వరప్రసాద్ ఒకరు.. 

చిరంజీవి అంటే దేవి వరప్రసాద్ కు అమితమైన ప్రేమ. ఆయన ఎప్పుడైనా అమెరికా వెళ్తే తన కూతురికి ఏం తీసుకోవాలని ఆలోచించే దానికంటే ముందు చిరంజీవికి ఏం తీసుకెళ్లాలని ఆలోచించే వారట. ఈ విధంగా నిర్మాత దేవి వర ప్రసాద్ చిరంజీవి కాంబినేషన్లో కొండవీటి రాజా, మంచి దొంగ,ఘరానా మొగుడు, చట్టంతో పోరాటం, అల్లుడా మజాకా, మృగరాజు వంటి చిత్రాలు వచ్చాయి. అప్పట్లో ఘరానా మొగుడు సినిమా సౌత్ లోనే 10 కోట్ల షేర్ సాధించి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన అల్లుడా మజాకా సినిమా కూడా అద్భుతమైన హిట్ అయింది. ఆ విధంగా ఎన్నో చిత్రాలు తీసి మంచి లాభాల బాట పట్టినటువంటి దేవి వరప్రసాద్ చివరి రోజుల్లో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు..

అలాంటి దేవి వరప్రసాద్ కు కష్టం వస్తే చివరి రోజుల్లో ఎవరూ పట్టించుకోలేదు అంటూ చిరంజీవి పై పరోక్షంగా కామెంట్లు చేశారు. ప్రస్తుత కాలంలో హీరోలు ఇండ్లు, భూములు కొంటున్నారు. నిర్మాతలు ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఏఎన్ఆర్,ఎన్టీఆర్ కాలంలో నిర్మాతలు ఎలా ఉన్నారు వారి పరిస్థితిలేంటని తెలుసుకుంటూ ముందుకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది నిర్మాతలు ఏమైపోయినా పర్లేదు కానీ హీరోలు మాత్రం కోట్ల రూపాయల రెమ్యూనరేషన్  తీసుకొని వారు సెటిల్ అయితే చాలు అనే విధంగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోల గురించి పరోక్షంగా కామెంట్ చేశారు నిర్మాత.

మరింత సమాచారం తెలుసుకోండి: