స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితుడైన ఆయన, తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. అయితే గత కొంతకాలంగా రామ్ చేసిన సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు చేయాలని కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ, ఆయ‌న నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించలేకపోయాయి.ఇలాంటి పరిస్థితుల్లో రామ్ నటించిన “ఆంధ్రా కింగ్ తాలూకా” సినిమా విడుదలయ్యే వరకు చాలా అనుమానాలు, సందేహాలు తారసపడ్డాయి. కానీ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచి, సోషల్ మీడియాలో సెన్సేషనల్ టాక్‌ను రాబట్టింది. సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో రామ్ పేరు మళ్లీ హాట్ టాపిక్‌గా మారిపోయింది.


ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించగా, రామ్ లుక్, పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్ ఎప్పుడూ చూపని కొత్త స్టైల్, ఎనర్జీ ఈ సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి.అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఇంత పెద్ద విజయం సాధించిన సినిమా కోసం రామ్ కేవలం 17 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని సమాచారం. వరుస ఫ్లాప్స్ కారణంగా మేకర్స్ పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేయలేకపోయారని, అదే సమయంలో సినిమా హిట్ కావడం తనకు ముఖ్యమని భావించిన రామ్ కూడా ఈ మొత్తానికే ఓకే చేసినట్లు తెలుస్తోంది.



కానీ ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇలా అంటున్నారు…“ఈ సినిమాలో రామ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్‌కి 50 కోట్లు ఇచ్చినా తక్కువే!” నిజం చెప్పాలంటే, ఈ సినిమాతో రామ్ మరోసారి తన స్టామినాను నిరూపించుకున్నాడు. స్క్రిప్ట్‌పై నమ్మకం, తన నటనతో చేసిన కష్టానికి ఈ విజయం పర్ఫెక్ట్ రిటర్న్ అనిపించుకోవచ్చు. చూడాలి మరి రామ్ పోతినేని నటించిన ఈ సినిమా మొదటీ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: