కానీ చివరికి ఆశ్చర్యకరంగా ఈ లక్కీ ఛాన్స్‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెల్చుకున్నాడని సమాచారం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘అట్లీ’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నప్పటికీ, రాజమౌళితో కలిసి పనిచేయబోతున్నాడన్న వార్త ఫ్యాన్స్‌లో ఆనందోత్సాహాలు నింపింది. అసలు ఈ కాంబినేషన్ కొత్తది కాదు. గతంలోనే రాజమౌళి–అల్లు అర్జున్ కాంబో గురించి పలుమార్లు చర్చలు వినిపించాయి. అయితే ఇప్పుడు అందుకు బలం చేకూర్చే సమాచారం బయటికి వచ్చింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, రాజమౌళి చాలా కాలంగా ఒక ప్రత్యేక కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేస్తూ ఉండగా, ఆ స్క్రిప్ట్‌కు అల్లు అర్జున్ అత్యంత సరిపోతాడని భావించినట్లు తెలుస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఒక హై-ఇంటెన్సిటీ స్పోర్ట్స్ డ్రామా, అందులో కూడా ప్రత్యేకంగా బాక్సింగ్ నేపథ్యం ఉండబోతోందట. రాజమౌళి సాధారణంగా హీరోను పూర్తిగా ట్రాన్స్ఫార్మేషన్‌లోకి తీసుకువెళ్తారన్న విషయం తెలిసిందే. అందువల్ల అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక ట్రైనింగ్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఇంటర్నేషనల్ లెవల్ కోచింగ్ తదితరాలు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో రాజమౌళి సినిమా అంటే అది సాధారణ కమర్షియల్ కథ కాకూడదు. అందులో డ్రామా, ఎమోషన్, కఠినమైన ప్రాక్టీస్ సెషన్స్, హీరో జర్నీ, ప్రతికూలతలపై పోరాటం వంటి ఎన్నో లేయర్లు ఉండే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ఇప్పటికే తన డెడికేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ‘పుష్ప’ సిరీస్‌లో చూపించిన అద్భుతమైన పని కారణంగా ఈ రోల్‌కు ఫ్యాన్స్ మరింత హైప్ ఇవ్వడం సహజం. ఇప్పటికే సోషల్ మీడియాలో “రాజమౌళి – అల్లు అర్జున్ బాక్సింగ్ మూవీ” అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అభిమానులు ఫ్యాన్ ఆర్ట్స్ చేస్తూ, కాన్సెప్ట్ పోస్టర్స్ క్రియేట్ చేస్తూ ఆన్‌లైన్‌ను హోరెత్తిస్తున్నారు.
మొత్తం మీద చూస్తే —ప్రభాస్ కాదు… తారక్ కాదు… చరణ్ కాదు…ట్రాక్‌లోకి తిరిగి వచ్చిన బన్నీనే తదుపరి జక్కన్న హీరో అని అర్ధమైపోతుంది. అఫిషియల్ ప్రకటన ఒక్కటే రావాలి అంతే..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి