ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం, గత దసరాకే వీరి నిశ్చితార్ధం పూర్తయిందని, అయితే ఫిబ్రవరి 26న గ్రాండ్ పెళ్లి వేడుకను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై విజయ్, రష్మిక ఇంకా అధికారికంగా స్పందించకపోయినా… ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త నిజమేనన్న నమ్మకం బలంగా పెరుగుతోంది.ఇదే సమయంలో ఆశ్చర్యం కలిగించే మరో వార్త కూడా బయటికొచ్చింది. అదేంటంటే — అదే తేదీ, అంటే ఫిబ్రవరి 26న మరొక స్టార్ హీరో పెళ్లి కూడా జరుగుతుందట. ఆ హీరో మరెవరో కాదు… అల్లు అరవింద్ చిన్న కుమారుడు, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్.
ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న శిరీష్, ఫిబ్రవరి 26నే తన వివాహాన్ని అత్యంత గ్రాండ్‌గా జరుపుకోవడానికి రెడీ అవుతున్నాడట. ఈ న్యూస్ బయటకు వచ్చాక ఫిలిం నగర్‌లో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది. ఒకే రోజున ఇద్దరు స్టార్ సెలబ్రిటీల పెళ్లి జరగబోతుండటంతో సోషల్ మీడియాలో హీటు మరింత పెరిగిపోయింది. టాలీవుడ్ అభిమానులు ఈ ఇద్దరు స్టార్ వెడ్డింగ్స్‌ను “డబుల్ వెడ్డింగ్ బెల్స్… టాలీవుడ్‌లో పెళ్లికళ వచ్చేసింది!” అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్యాన్స్‌లో ఉత్సాహం, ఆసక్తి, అంచనాలు ఇప్పుడు పీక్‌కి చేరుకున్నాయి. మరి ఈ వార్తలపై అధికారిక ధృవీకరణ కోసం మాత్రం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి