టాలీవుడ్ కథానాయకుడు నాగచైతన్య గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ప్రస్తుతం వృషకర్మ అనే సినిమాలో నటిస్తున్నారు, దీనిపై ప్రేక్షకుల అంచనాలు బాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా ఒక సందర్భంలో నటి అమల (నాగార్జున గారి సతీమణి) నాగచైతన్య గొప్పదనం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమల మాట్లాడుతూ... చైతన్య తన బాల్యాన్ని చెన్నైలో తన తల్లితో గడిపాడని, ఆ తర్వాత కాలేజీ చదువుల కోసం హైదరాబాద్ వచ్చాడని తెలిపారు. చైతన్య గురించి తనకు ముందే తెలిసినప్పటికీ, హైదరాబాద్ వచ్చిన తర్వాతే అతన్ని మరింత బాగా అర్థం చేసుకోగలిగానని ఆమె అన్నారు.
చైతన్య ఒక మంచి యువకుడు, చాలా తెలివైనవాడు, అలాగే మృదువైన మనస్తత్వం కలవాడని అమల ప్రశంసించారు. ముఖ్యంగా, అతను తన తండ్రి మాట జవ దాటడని మరియు తనకంటూ సొంత ప్రతిభ ఉన్న యువకుడని ఆమె తెలిపారు. చైతన్య బాల్యం రెండు కుటుంబాల మధ్య సంతోషంగా గడిచిందని అమల ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అమల చేసిన ఈ వ్యాఖ్యలు నాగచైతన్య అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఏకంగా 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. విరూపాక్ష సినిమా డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. చైతన్య ఈ సినిమాతో తండేల్ సినిమాను మించిన విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి