టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా సీక్వెల్‌ల జోరు బాగా పెరిగిపోయింది. ఒక సినిమా హిట్ కొట్టిందంటే వెంటనే దానికి పార్ట్ 2, పార్ట్ 3 అంటూ సిరీస్‌గా తీసుకెళ్లే ట్రెండ్ ఎక్కువైంది. సినిమా ఎండింగ్‌లో క్లైమాక్స్‌ని ఓపెన్‌గా వదిలిపెట్టి, “తదుపరి భాగంలో అసలు కథ మొదలవుతుంది” అన్నట్టుగా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఉండటం ఇప్పుడు చాలా కామన్. కొన్ని సినిమాలు అయితే నేరుగా పార్ట్ 4, పార్ట్ 5 వరకు ప్లాన్ చేసే స్థాయికి వెళ్లిపోయాయి. కానీ ఈ సీక్వెల్ ఫీవర్ అందరికి పనిచెయ్యడం లేదు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ విషయంలో ఇదే ట్రెండ్ పెద్ద షాక్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ టాక్.


దేవర 2కి బ్రేక్? – తారక్ సీక్వెల్ ప్లాన్ పై సందేహాలు:

తారక్ నటించిన దేవర పార్ట్ 1 విడుదలకు ముందే, మేకర్స్  దేవర 2 రాబోతుందని ఎనౌన్స్ చేశారు. కానీ తాజా బజ్ ప్రకారం సీక్వెల్‌పై పెద్దగా వర్క్ కొనసాగడం లేదని, సినిమా కాన్సెప్ట్ కూడా మేకర్స్‌కు సంతృప్తి ఇవ్వలేదని సమాచారం. సినిమా మీద ఉన్న హైప్ కూడా అనుకున్నంతగా రాకపోవడం వల్ల సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో సందేహాలు వచ్చాయని టాక్.


హరిహర వీరమల్లు పార్ట్ 2—కి కూడా అదే పరిస్ధితి:

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు కూడా పార్ట్ 1తో పాటు పార్ట్ 2 ఉంటుందని అప్పట్లో చెప్పారే తప్ప, ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఏమవుతుంది? ఏ దశలో ఉంది? అన్న విషయాలు పూర్తిగా క్లారిటీ లేకపోవడంతో, ఆ ప్రాజెక్ట్ కూడా నిశ్శబ్దంలో కలిసిపోయిందనే అభిప్రాయం పెరుగుతోంది.దీంతో పవన్ – తారక్ లైన్‌లో వచ్చిన సీక్వెల్ ట్రెండ్‌కు తాత్కాలికంగానైనా ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది.



ఇప్పుడు మొత్తం దృష్టి రామ్‌చరణ్‌పై – రంగస్థలం 2 వస్తుందా?

ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ మొత్తం చూస్తున్న తదుపరి పేరు రామ్ చరణ్‌.ఇటీవల సోషల్ మీడియాలో రామ్ చరణ్సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో వెంటనే అభిమానుల్లో “అది రంగస్థలం 2నా?” అన్న ఆసక్తి పెరిగిపోయింది.రంగస్థలం మొదటి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో, సీక్వెల్ వస్తే అది టాలీవుడ్‌లో భారీ హంగామా సృష్టించడం ఖాయం. అయితే సుకుమార్రామ్ చరణ్ కాంబినేషన్ నిజమే అయినా, అది రంగస్థలం సీక్వెల్ కాన్సెప్ట్ కాదా? లేక పూర్తిగా కొత్త కథా? అన్నదానిపై ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత లేదు.



రంగస్థలం 2 అయితే అవాంతరాలు?

అభిమానులు మాత్రం రంగస్థలం 2 వస్తే కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సినిమా ఒక పీరియడ్ మాస్ డ్రామా కావడం..కథను ముందుకు తీసుకెళ్లడం కోసం పూర్తిగా కొత్త కాన్సెప్ట్ అవసరం కావడం.. తదితర పాత్రలను లాజికల్‌గా మళ్లీ రూపకల్పన చేయాల్సిన అవసరం. ఇవి అన్నీ సీక్వెల్‌కి చాలానే సవాళ్లు తీసుకురాగలవనే అభిప్రాయం ఉంది. ఒకవేళ సీక్వెల్ కాకపోతే? ఇక  రామ్‌చరణ్ కూడా సీక్వెల్ ట్రెండ్‌ను పక్కన పెట్టినట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: