ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత వేడి వేడిగా మారిన చర్చ ఇదే. కొద్దిసేపటి క్రితమే థియేటర్లలో విడుదలైన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా మొదటి షో నుంచే అద్భుతమైన హిట్ టాక్‌ను దక్కించుకుంది. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండటం, రామ్ పోతినేని లుక్స్ పూర్తిగా మారిపోవడం, ఆయన నేచురల్ యాక్టింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం—ఈ సినిమాకు భారీ పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి.భాగ్యశ్రీ అందాలు, రామ్ నటన, దర్శకుడు మహేష్ టేకింగ్— అన్ని సినిమా స్టాండర్డ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. రిలీజ్ అయిన ప్రతి సెంటర్‌లో కూడా “బొమ్మ బ్లాక్‌బస్టర్.. హిట్ టాక్.. రామ్ కెరీర్ బెస్ట్!” అంటూ జనాలు పొగడ్తలు కురిపిస్తున్నారు.


అయితే, ఈ విజయంతో పాటు సోషల్ మీడియాలో మరొక వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అదేంటంటే..ఈ సినిమా కథను ఒక ప్రముఖ తమిళ హీరో జీవితానికి దగ్గరగా ఉద్దేశించి తీశారా..? అన్న అనుమానం. కథ విషయానికి వస్తే—ఒక టాప్ సూపర్‌స్టార్ సినిమా షూటింగ్ మధ్యలో ఫైనాన్స్ కొరత కారణంగా ఆగిపోయుతుంది. మొత్తం మూడు కోట్లు పెండింగ్‌లో ఉండటం వల్ల సినిమా పూర్తికావడం కష్టమైపోతుంది. ఈ విషయం ఆ హీరోకు ఫ్యాన్ తెలిసి షాక్ అవుతాడు. ఏదేమైనా తన ఫేవరెట్ హీరో సినిమా ఎలాగైనా పూర్తవ్వాలని భావించి ఆ మూడు కోట్లను అడ్జస్ట్ చేయడానికి పరుగులు తీస్తాడు.



ఇక హీరో విషయానికి వస్తే—నిర్మాత ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో, తాను సరిపడని పాత్ర అయినప్పటికీ ఒక సీనియర్ రోల్‌కు అంగీకరించడానికి సిద్ధమవుతాడు. అయితే, ఆయన ఆ ఆఫర్‌ను ఒప్పుకునే టైంలోనే— అకస్మాత్తుగా ఆయన అకౌంట్‌లో మూడు కోట్లు జమ అవుతాయి.ఈ డబ్బు ఎవరు పంపారు..? ఎందుకు పంపారు..? అని విచారించగా— రాజమండ్రి దగ్గరలోని ఒక చిన్న పల్లెటూరి కుర్రాడు పంపించాడు అని బయటపడుతుంది. అబ్బాయి ఆయనకి నిజమైన అభిమానిగా, అతని సినిమా నిలిచిపోకూడదనే ఉద్దేశంతో చేసిన సహాయం ఇది అని తెలుసుకొని హీరో మరియు టీమ్ ఆశ్చర్యపోతారు.



ఈ నేపథ్యంలో—అభిమాని ఎలా మూడు కోట్లు అమౌంట్ ఇచ్చాడు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అతని జీవితం లో మధ్యలో ఏం రాధాంతాలు జరిగాయి?అన్నదే అసలు కథ . ఈ ఆసక్తికరమైన కథానాయకత్వం వల్లే సినిమా ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తోంది.సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక పోలిక వైరల్ అవుతోంది—ఈ సంఘటన ఒక ప్రముఖ తమిళ హీరో కెరియర్‌లో ఇదే తరహాలో జరిగినట్లు గతంలో వచ్చిన వార్తలతో ఈ కథ  ఉందని, దర్శకుడు మహేష్ ఆ హీరో నిజ జీవిత ఘటనను బేస్ చేసుకుని కొంత మార్పులతో కథను తయారు చేశాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడీ టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.“సినిమా కథ నిజంగా ఆ తమిళ స్టార్‌ను దృష్టిలో పెట్టుకొని తీయబడిందా..? లేక ఇది కేవలం యాదృచ్చికమా..?”అనే చర్చ నెట్‌లో జోరుగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: