దీంతో ఈ విమర్శలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి . ఇక దీనివలన సోనాలి చేసిన మాటలపై అర్థం తప్పుగా తీసుకుంటున్నారు అనే భావన కలిగి వెంటనే వ్యాఖ్యలను క్లారిటీ వెల్లడించింది సోనాలి . తాను ఎప్పుడూ డాక్టర్ని అని చెప్పలేదని ఎవరిని తప్పుదారి పట్టించే ఉద్దేశం లేదని సోనాలి స్పష్టం చేయడం జరిగింది . అదేవిధంగా .. " నేను మోసగత్తిని కాదు నేను క్యాన్సర్ బాధ తెలిసిన మనిషిని " అనిత నా బాధని వెల్లడించింది . ఇక తన అనుభవం మరియు తనకు పని చేసిన విధానం మాత్రమే పంచుకున్నానని దాన్ని అందరూ ఫాలో అవ్వాలని చెప్పలేదని ఆమె తెలిపింది .
ప్రతి క్యాన్సర్ వేరు మరియు ప్రతి ఒక్కరి చికిత్స విధానం వేరు అని మరోసారి గుర్తు చేయడం జరిగింది . ఇక క్యాన్సర్ తో పోరాడినప్పుడు ఎదురైన భయం మరియు నొప్పి అదే విధంగా మానసిక బాధలు అన్నిటిని నిజాయితీగా పంచుకోవడమే తన ఉద్దేశం అని తెలిపింది . క్యాన్సర్ నుంచి బయటపడిన తరువాత సోనాలి ఎప్పుడు ధైర్యం మరియు ఆశ అనే సందేశాలు ఇస్తూ ఉంటుంది . ఇక తన జర్నీతో చాలామందికి స్ఫూర్తినిస్తుందనే విషయం మాత్రం వాస్తవం . ఏదేమైనప్పటికీ ప్రజెంట్ సోనాలి బింద్రే తన వ్యాఖ్యలను కరెక్ట్ చేసుకునే ప్రేక్షకులను క్షమాపణలు అడగడం జరిగింది . మరి ఈమె క్షమాపణలను ప్రేక్షకులు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి