రీసెంట్‌గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌నే తీసుకోండి. కేవలం టైటిల్ రివీల్ కోసం ఇంత భారీ కార్యక్రమం అవసరమా? అంటూ కొందరు కామెడీలు పేల్చినా… ఈవెంట్ ముగిసే సరికి దేశం మొత్తం ‘వారణాసి’ గురించే మాట్లాడింది. సోషల్ మీడియాలో హాష్‌ట్యాగ్‌లు, డిస్కషన్స్, ఫ్యాన్ థియరీస్—ప్రతి చోటా వారణాసి మేనియా కనిపించింది. ఇదే రాజమౌళి టచ్.ముందుగా విలన్ క్యారక్టర్ ‘కుంభ’ ఫస్ట్ లుక్ వచ్చి ఇంటర్నెట్‌ని షేక్ చేసింది. కుంభ లుక్‌పై వచ్చిన మీమ్స్, వీడియోలు, ట్రోల్స్—ఇవన్నీ కలిసి ఏ పెద్ద సినిమా మొదటి లుక్‌కూ రానంత హడావిడి క్రియేట్ చేశాయి. ఆ వెంటనే ప్రియాంక చోప్రా లుక్ విడుదలవగానే కొత్త రేంజ్ హైప్. చివరిగా మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను గ్లింప్స్ వీడియో రూపంలో రిలీజ్ చేయడంతో మూడో మోత మోగింది.
గ్లింప్స్ వీడియోలో చూపించిన ప్రదేశాలపై నెటిజెన్స్ చేసిన రీసర్చ్ కూడా సినిమాపై ఆసక్తిని ఇంకా పెంచేసింది. వారణాసి, కైలాస్, పురాణాలలో ఉన్న సూచనలు, కథలోని క్లూస్, ఫ్రేమ్‌లలో దాగిన వివరాలు—ఇవి అన్నింటిని డీకోడ్ చేస్తూ యూట్యూబ్‌లో వందలాది వీడియోలు వరుసగా వచ్చాయి. ఒక్క గ్లింప్స్‌తోనే ఇలా ఉంటే… సినిమా రిలీజ్ టైమ్‌లో ఏమవుతుందో ఊహించడమే థ్రిల్లింగ్‌గా మారింది.మొత్తానికి రాజమౌళి దూకుడు ఇదే. సినిమా షూట్ ఇంకా పూర్తిగా మొదలవ్వకముందే, రిలీజ్‌కు రెండు సంవత్సరాల ముందు నుంచే హైప్‌ని ఆకాశానికెత్తేశారు. ఇక రాబోయే నెలల్లో విడుదలయ్యే మరిన్ని కంటెంట్, ఇంటర్వ్యూలు, ఈవెంట్స్— ఈ సినిమా అంచనాలను ఎక్కడికి తీసుకెళ్తాయో ఊహించడం కూడా కష్టం. “రాజమౌళి ఒక సినిమా తీస్తున్నాడంటే అది సినిమా కాదు, అది ఒక ప్రపంచ స్థాయి ఈవెంట్.”ఇక ‘వారణాసి’ విషయంలో ఆయన ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడటం మాత్రమే మిగిలింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి