పోస్టర్‌లో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో దర్శనమిచ్చారు. ఒక లుక్‌లో యుద్ధరంగాన్ని కంపించేలా యోధుడిలా కనిపిస్తే, మరో లుక్‌లో రాజసంగా, శాస్త్రోక్తమైన భారంతో రాజులా కనిపించారు. బాలయ్య ఇప్పటి వరకు అనేక చిత్రాల్లో రాజుగా కనిపించగా, యోధుడి అవతారంలో ఇదే తొలిసారి కనిపించడం విశేషం. తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇలాంటి లుక్ చూడటం అభిమానులకు నిజంగా మైండ్ బ్లాక్ అయ్యే అనుభూతిని ఇస్తుంది.స్పెషల్ పోస్టర్‌లో బాలయ్య ఒక చేతిలో ఖడ్గాన్ని, మరో చేతిలో యాంకర్‌ను పట్టుకుని అప్రతిహతమైన శౌర్యాన్ని ప్రతిబింబించారు.
ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే—ఈ సినిమాలో బాలయ్య హీరోగా మాత్రమే కాకుండా, విలన్‌గా కూడా కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇది నిజమే అయితే, ఈ సినిమా బాలకృష్ణ కెరీయర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రం భావోద్వేగాలు, యాక్షన్, విజువల్ వండర్— ప్యాకేజీగా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించబోతోందని సినిమా యూనిట్ చెబుతోంది. అధునాతన సాంకేతికత, భారీ సెట్స్, పవర్‌ఫుల్ పాత్రలతో ఈ చిత్రం బాలయ్య కెరీయర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి