అయితే, ఈ కాంబినేషన్ వెలుగులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మాత్రం భారీ స్థాయిలో ట్రోలింగ్ మొదలైంది. "ఒకప్పుడు శర్వానంద్ సినిమాల్లో హీరోయిన్ అంటే స్టార్ రేంజ్ బ్యూటీస్ ఉండేవారు… ఇప్పుడు ఎలా మారిపోయాడు?" అనే కామెంట్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ కెరీర్‌లో వరుస ఫ్లాపులు రావడం వల్ల అతని మార్కెట్, రెమ్యునరేషన్, ప్రాజెక్టుల స్థాయి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే కారణంగా ఈ తరహా కాస్టింగ్ జరుగుతోందని కొందరు ట్రోల్స్ ఘాటుగా ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరు “శర్వా పక్కన అలాంటి ఫిగరా?” అంటూ అతి దూకుడుగా ట్రోలింగ్ చేస్తున్నారు.
అయితే అభిమానుల అభిప్రాయం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కెరీర్ పరంగా ఎదురైన సమస్యల వల్ల శర్వానంద్ కొంత వెనకబడ్డా, టాలెంట్ పరంగా మాత్రం ఆయన ఎప్పుడూ టాప్ క్లాస్ అనే నమ్మకం వారికి ఉంది. అలాంటప్పుడు ఆయన చేస్తున్న కొత్త సినిమా ఒక సాలిడ్ కంబ్యాక్ అవుతుందనే విశ్వాసం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం శర్వానంద్ తన లుక్ మీద చాలా కసరత్తులు చేస్తున్నాడని, స్పెషల్ గా ట్రాన్స్‌ఫర్మేషన్ మీద పని చేస్తున్నాడని సమాచారం. స్లిమ్ అవుతూ, ఎనర్జీ లెవెల్స్ పెంచుతూ, నూతన స్టైల్లో కనిపించేందుకు శర్వా శ్రమిస్తున్నాడట.
ఇదిలా ఉంటే, ఈ కథలో హీరో చిన్న వయసులో, తెలియని ఆవేశంలో చేసిన ఒక పెద్ద తప్పు వల్ల అతని జీవితంలో ఎలా భారీ డ్రామా సృష్టించబడుతుందో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఆ సంఘటన కారణంగా అతని ప్రస్తుత జీవితం ఏ విధంగా మారిపోతుందో, ఆ డ్రామా ఎలా ఎమోషనల్‌గా, ఎలా ఎంటర్టైనింగ్‌గా మలచబడుతుందో దర్శకుడు శ్రీను వైట్ల ప్రత్యేక శైలిలో చూపించబోతున్నారట. కామెడీ, ఎమోషన్, యాక్షన్ – అన్నింటినీ కలిపిన పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి