కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక వినూత్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే విషయం ఇప్పటికే తెలిసిందే. ఈ సినిమాకు తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌ చూస్తూనే కుటుంబ సంబంధాలు, భర్త–భార్య అనుబంధం మీద ఏదో కొత్త కాన్సెప్ట్ ఉండబోతుందనే భావన కలుగుతోంది.ఈ చిత్రంలో ఆషిక రంగన్నాధ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రవితేజ ఎనర్జీకి తగ్గట్టుగానే, కిశోర్ తిరుమల స్టైల్‌కు తగ్గట్టుగానే భావోద్వేగాలు–ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు సమాచారం. మేకర్స్‌ 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఇదిలా ఉంటే… తాజాగా రవితేజ సీరియస్ టోన్‌లో మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో రామ సత్యనారాయణ అనే ప్రధాన పాత్రలో కనిపించబోతున్న రవితేజ, తనలోని మరో కోణాన్ని బయటపెట్టే విధంగా రూపొందించిన ఓ ప్రత్యేక వీడియోను టీమ్ విడుదల చేసింది. ఆ వీడియోలో రవితేజ మాట్లాడుతూ..“రామ సత్యనారాయణ ఒక్కడిలోనే కాదు… ప్రతి మగాడిలో ‘ఎల్విస్’ లాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు. ఇప్పుడు మీకు ఒక వరస్ట్ ఫెలోని పరిచయం చేయబోతున్నాను. వాడి వల్ల ఇద్దరు ఆడోళ్లు నన్ను రెండు ప్రశ్నలు వేశారు. ప్రతీ ఒక్కరిలో వాడు ఉంటాడు… కానీ బయటకు రావడానికి అవకాశం కోసం చూస్తూ ఉంటాడు.”



ఈ డైలాగ్స్ చెబుతూనే రవి తేజ సీరియస్‌గా కనిపిస్తారు. వెంటనే ఆయన సిగ్నేచర్ స్టైల్‌లో“అప్పుడు ఏంట్రా… వాగుతున్నావ్?”అంటూ మరో రవితేజ మోడ్‌లోకి మారిపోవడం వీడియో ముఖ్య హైలైట్‌గా మారింది.ఈ క్లిప్‌ ప్రస్తుతం ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రవితేజ డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడేమో అన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. మొదటి ప్రమోషన్ల నుంచే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, రవితేజ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన ఫ్యామిలీ–ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రానుందనే ఆశలు పెరుగుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: