హీరోయిన్ సమంత దర్శకుడు, నిర్మాత అయినటువంటి రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నో రోజుల నుండి ప్రచారం జరుగుతుంది. అయితే డిసెంబర్ 1 న వీరి పెళ్లి జరగబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టుల వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజే సమంత రాజ్ నీడిమోరులు పెళ్లి చేసుకోబోతున్నారని, అది కూడా సమంతకు ఎంతో ఇష్టమైన ప్లేస్ లో వీరి పెళ్లి జరగబోతుందనే ప్రచారం జరుగుతుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చక్కర్లు కొడుతుంది. అయితే ఇప్పటి వరకు సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఎక్కడా కూడా ప్రకటించలేదు. కానీ ఈ రోజే ఆమె పెళ్లి జరగబోతుందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. గత కొద్ది రోజులుగా సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో కలిసి వెళ్తుంది. 

ఎక్కడికి వెళ్లినా కూడా ఈ జంట కనిపించడంతో వీరి మధ్య ఎఫైర్ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇది నిజమే అన్నట్లు ఈ జంట కూడా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఈ జంట వెకేషన్ లకు వెళ్తూ ఫ్రెండ్స్ లాగే ప్రవర్తించినప్పటికీ రీసెంట్ గా మాత్రం సమంత రాజ్ తో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.దీంతో డౌటే లేదు ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత రాజ్ ఇద్దరు సమంతకు ఎంతో ఇష్టమైనటువంటి కోయంబత్తూర్ లోని ఈషా యోగ సెంటర్లో పెళ్లి బంధంతో ఒక్కటవబోతున్నారని పలు కథనాలు వినిపిస్తున్నాయి.అయితే ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు అటు సమంత నుండి గానీ ఇటు రాజ్ నిడిమోరు నుండి గానీ ఎలాంటి క్లారిటీ రాకపోయినప్పటికీ రాజ్ నిడిమోరు మొదటి భార్య శ్యామిలీ దే మాత్రం ఒక సంచలన పోస్ట్ పెట్టింది.

శ్యామిలీ దే తన సోషల్ మీడియా ఖాతాలో "తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు" అంటూ ఒక సంచలన పోస్ట్ పెట్టడంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక సమంత రాజ్ నిడిమోరుల రెండో పెళ్లి వార్తలు వినిపిస్తున్న వేళ శ్యామిలి దే పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో శ్యామిలీ దే తన భర్తను తన నుండి దూరం చేసిందనే కోపంతోనే బరి తెగించింది ఎలాంటి పనైనా చేస్తుంది అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టినట్లు పలువురు కామెంట్లు పెడుతున్నారు.మరి కొంత మందేమో సమంత చేసింది చాలా తప్పు పెళ్లి కాని వారిని లేదా ముందే విడాకులు తీసుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుండు.ఇలా ఒకరి కాపురంలో చిచ్చు పెట్టి సంతోషంగా ఉండాలనుకుంటుంది అని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: