టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ గురించి మాట్లాడినప్పుడు, ఆయన చేసిన ప్రయోగాత్మక చిత్రాలలో ముందుగా గుర్తొచ్చేది '1: నేనొక్కడినే'! క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో, అత్యంత ప్రతిష్టాత్మకంగా, హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కిన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 2014లో విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీగా నిరాశపరిచింది. మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ఫెయిల్యూర్‌కు అసలు కారణం ఏంటో తాజాగా నిర్మాతల్లో ఒకరైన రామ్ ఆచంట రివీల్ చేశారు.'1: నేనొక్కడినే' ఫెయిల్యూర్‌పై స్పందించిన నిర్మాత రామ్ ఆచంట, తాము ఎక్కడ తప్పు చేశామో విశ్లేషించారు. "సినిమా కథ వేరే, తీసిన విధానం వేరు. కానీ ఆ విషయాన్ని ఆడియన్స్‌కు చెప్పలేకపోయాం!" అని ఆయన స్పష్టం చేశారు.


నిజానికి, ఈ సినిమా ప్రధానంగా హీరో జ్ఞాపకశక్తి లోపంతో (Psychological Flaw) పోరాడే ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అయితే, టీజర్, ట్రైలర్‌లలో ఆ మిస్టరీని రివీల్ చేయకుండా, కేవలం స్టైలిష్ యాక్షన్, జేమ్స్ బాండ్ తరహా సిరీస్‌గా హైలైట్ చేశామని, దాని వల్లే ప్రేక్షకులు నిరాశ చెందారని రామ్ ఆచంట ఒప్పుకున్నారు. "టీజర్, ట్రైలర్‌లలో కంటెంట్ గురించి చెప్పి ఉంటే బాగుండేది. ఆ విషయంలో తాము ఫెయిల్‌ అయ్యాం" అని ఆయన అన్నారు.మరో నిర్మాత అనిల్ సుంకర కూడా గతంలో ఈ విషయంపై స్పందిస్తూ, ఈ కంటెంట్ వర్కౌట్ కాదని తమకు మూడు నెలల ముందే తెలిసిందని చెప్పారు. అయితే, ఈ ఫెయిల్యూర్‌ను మహేష్ బాబు అస్సలు తీసుకోలేకపోయారట!


"మహేష్ ఈ సినిమా కోసం డే అండ్ నైట్ వర్క్ చేశాడు. ఆయనలాంటి స్టార్‌ను ఒక లోపం ఉన్న వ్యక్తిలా చూపిస్తే అభిమానులు తీసుకోలేరని, ఆ కంటెంటే ఫెయిల్యూర్‌కు కారణం" అని అనిల్ సుంకర తెలిపారు. ఒక మాస్ హీరో ఈ తరహా సైకలాజికల్ కథను ఎంచుకోవడం సాహసమే అయినా, సరైన ప్రమోషనల్ స్ట్రాటజీ లేకపోవడం వల్లే ఈ మాస్టర్‌పీస్ బాక్సాఫీస్ వద్ద మాస్ డిజాస్టర్‌గా నిలిచింది!

మరింత సమాచారం తెలుసుకోండి: