అయితే.. నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన ఈ రూ.650 కోట్ల బంపర్ ఆఫర్‌ను కూడా రాజమౌళి, నిర్మాతలతో కలిసి తిరస్కరించారు! ఈ అడ్వెంచర్ ఎపిక్ రేంజ్, దాని కంటెంట్ అవుట్‌పుట్, ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల తర్వాత అది సృష్టించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని.. రూ.650 కోట్లు కూడా తక్కువే అని మేకర్స్ భావించారట. ఈ సినిమా డిజిటల్ రైట్స్ సుమారు రూ.800 కోట్లకు పైగా పలుకుతాయని రాజమౌళి టీమ్ అంచనా వేస్తున్నట్టు సమాచారం!షూటింగ్ ప్రారంభానికి ముందే రూ.650 కోట్ల ఆఫర్‌ను కాదనుకోవడం అనేది రాజమౌళి కాన్ఫిడెన్స్‌కు నిదర్శనమా? లేక ఓవర్ కాన్ఫిడెన్స్‌గా కొందరు భావిస్తున్నారా? అన్న చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. కానీ, 'RRR' సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో రాజమౌళి అంచనాలే నిజమయ్యాయి.
మహేష్ బాబు 'గ్లోబల్ అడ్వెంచరర్' పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన 'ప్రపంచ పరిచయ వీడియో'.. సినిమాపై అంచనాలను ఏ స్థాయిలో పెంచిందో మనకు తెలుసు. ఏదేమైనా.. రూ.650 కోట్ల ఆఫర్‌ను కూడా కాదనుకోవడం అనేది రాజమౌళి - మహేష్ బాబు కాంబో రేంజ్, ఇండియన్ సినిమా మార్కెట్ గతిని స్పష్టంగా తెలియజేస్తోంది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి