మాస్ ఎలివేషన్లకు తాండవం! ఫస్ట్ రివ్యూ హైలైట్స్ ఇవే...
సెన్సార్ సభ్యులు సినిమాను వీక్షించిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, బోయపాటి శ్రీను ఈసారి మాస్ ఎలివేషన్స్ విషయంలో ఏమాత్రం తగ్గలేదట. ఫస్ట్ హాఫ్ అంతా "పైసా వసూల్" లాగా ఉంటే, ఇంటర్వెల్ బ్లాక్ అయితే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని చెబుతున్నారు. ఇక సెకండాఫ్ అయితే "అంతకు మించి" ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కామెంట్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) ధాటికి థియేటర్ల బాక్సులు బద్దలవడం ఖాయమనే టాక్ బలంగా ఉంది.
మహా కుంభమేళా ఎపిసోడ్ - దేశభక్తి, దైవభక్తి కలయిక!
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ మరియు అసాధారణమైన హైలైట్గా నిలిచేది మహా కుంభమేళా ఎపిసోడ్. దర్శకుడు బోయపాటి శ్రీను సాహసం చేసి, ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో రియల్ అఘోరాలు, నాగ సాధువుల మధ్య బాలయ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ దృశ్యాలు వెండితెరపై అద్భుతమైన దివ్య అనుభూతిని ఇస్తాయట.ఇప్పటివరకు 'అఖండ' కేవలం ధర్మాన్ని, తన కుటుంబాన్ని కాపాడితే, సీక్వెల్‌లో దైవభక్తికి దేశభక్తిని జోడించారు. ఈసారి అఖండ పాత్ర పాకిస్థాన్, చైనాలకు చెందిన దుష్ట శక్తులను ఎదుర్కొని, దేశాన్ని ధర్మాన్ని ఎలా కాపాడాడు అనేదే అసలు కథ. బాలయ్య చెప్పే "విశ్వరూపాన్ని చూసి ఉండవు" లాంటి పవర్‌ఫుల్ డైలాగులు, సర్జికల్ స్ట్రైక్ తరహా యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను కుర్చీల్లో కూర్చోనివ్వవట.మొత్తం మీద, నందమూరి బాలకృష్ణ నటనకు జాతీయ అవార్డు దక్కడం పక్కా అని, ఈ 'అఖండ 2 - తాండవం'తో బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మాస్ రికార్డులు సృష్టిస్తారని ఇండస్ట్రీ టాక్. డిసెంబర్ 5న బాక్సాఫీస్ వద్ద రుద్ర తాండవం చూడటానికి మాస్ ఆడియన్స్ సిద్ధం కావాలి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి