ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హీరోయిన్ సమంత రెండో పెళ్లి గురించే చర్చలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఆమె పేరు పలువురు దర్శకులు, నటులతో అనేక రకాల రూమర్స్‌లో వినిపించినప్పటికీ—అవన్నీ నిజం కాదని, వాటిలో ఏ సంబంధం లేదని ఫ్యాన్స్ మాట్లాడుకునేవారు. కానీ ఈసారి మాత్రం అంతా తేలిపోయింది. చాలా కాలం నుంచి ప్రచారంలో ఉన్న డైరెక్టర్ రాజ్ నిడమూరుతో ఉన్న బంధం ఇప్పుడు అధికారికంగా పెళ్లి బంధంగా మారిపోయింది.నిన్న కోయంబత్తూరు లోని ఈషా ఫౌండేషన్‌లో, లింగ భైరవి దేవి సమక్షంలో సమంత–రాజ్ నిడమూరు వివాహం సంప్రదాయ పద్ధతుల్లో సాదాసీదాగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది. పెళ్లి పూర్తయ్యాక సమంత స్వయంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ, వివాహం జరిగిన ఫోటోలను విడుదల చేసింది. ఆ చిత్రాలు కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయ్యి సోషల్ మీడియా అంతా నిండిపోయాయి.


ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న ఏమిటంటే—“సమంత ఎందుకు రాజ్ నిడమూరునే పెళ్లి చేసుకుంది?”, “ఈ రాజు నిడమూరు ఎవరు? ఆమెకు ఆయన ఎలా పరిచయం?”, “వీరిరువురి ప్రేమ ఎలా మొదలైంది?” అనే సందేహాలు.ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సమంత–రాజ్ ల పరిచయం సినిమా పనుల ద్వారానే ప్రారంభమైంది. మొదట ఇద్దరూ ప్రొఫెషనల్‌గా మాత్రమే మాట్లాడుకునేవారని,  ఆ పరిచయం స్నేహంగా మారింది. సమంత వ్యక్తిగతంగా ఎలాంటి కష్టసుఖాల్లోనైనా తనతో మాట్లాడే, అర్థం చేసుకునే వ్యక్తిగా రాజ్ ను చాలా కాలం నుంచే చూస్తోంది.



రాజ్ నిడమూరు వ్యక్తిగతంగా చాలా వినయపూర్వకుడు, నిజాయితీ గల వ్యక్తి అని ఆయన స్నేహితులు చెప్తున్నారు. మధ్యతరగతి కుటుంబంలో పెరిగి, ఎలాంటి పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక్కొమెట్టు కష్టపడి ఎదిగి, నేడు తన కాళ్లపై నిలబడి, ఇతరులకు సహాయం చేసే స్థాయికి చేరుకున్నాడట. పింక్‌విల్లా, డైలీ జాగ్రన్ నివేదికల ప్రకారం, రాజ్ నిడిమోరు నికర విలువ రూ. 83-85 కోట్లు (సుమారు $10 మిలియన్) గా అంచనా వేయబడింది. దర్శకుడు, నిర్మాత, స్క్రీన్‌రైటర్ పాత్రల ద్వారా ఆయన ఆస్తులు సంపాదించారు. స్ట్రీమింగ్ రైట్స్, థియేట్రికల్ రిలీజ్‌లు, కాపీరైట్ రాయల్టీలు కూడా ముఖ్య ఆదాయ వనరులుగా ఉన్నాయిఇక నెటిజన్ల స్పందన విషయానికి వస్తే—కొంతమంది సమంత - రాజ్ ఆస్తి చూసి పెళ్లి చేసుకుందనగా కామెంట్స్ చేస్తున్నా, మరోవైపు చాలా మంది అభిమానులు అలాంటి ఆ మాటలను పూర్తిగా ఖండిస్తున్నారు. సమంత స్థాయి, పేరున్న స్టార్ కావడంతో ఎంతమంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కోటీశ్వరులు ప్రపోజ్ చేసినా—వారిని అందరినీ తిరస్కరించింది. అలాంటప్పుడు కేవలం ఆస్తి కోసం ఆమె పెళ్లి చేసుకుందనే అభిప్రాయం తప్పు అని అభిమానులు అంటున్నారు.



వారు చెబుతున్నది ఒక్కటే—“సమంత మనసులో రాజ్  నిడమూరులో నీతి నిజాయితి  చూసి, అతనితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె ఇష్టాన్ని గౌరవించాలి. హ్యాపీగా ఉండాలని కోరుకుందాం అంటున్నారు.”మొత్తానికి ఎవరు ఎన్ని మాట్లాడిన… చర్చలు ఎన్ని జరిగిన… వివాదాలు ఎలా వచ్చిన… సమంత రెండో పెళ్లి పూర్తి అయ్యింది. ఇప్పుడు ఆమె జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. రాజ్ తో ఆమె ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలని అభిమానులు ప్రేమతో, ఆశీర్వాదాలతో సోషల్ మీడియా అంతా నింపేస్తున్నారు. కొందరు ప్రేమ గుడ్డిదే సమంత లాంటి అమ్మాయిడైరెక్టర్ కి పడిపోవడం ఏంటి అంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: