సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో—ఎక్కడ చూసినా ప్రస్తుతం హీరోయిన్ సమంత రెండో పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. చాలా కాలంగా సమంత–రాజ్ నిడమూరు మధ్య డేటింగ్ జరుగుతుందనే రూమర్లు వినిపించాయి. ఆ వార్తలన్నింటికీ ముగింపు పలుకుతూ, తాజాగా వీరిద్దరూ అధికారికంగా పెళ్లి పీటలు ఎక్కారు. కోయంబత్తూరు ఈశా యోగా సెంటర్‌లోని లింగ భైరవి దేవాలయం వద్ద అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో ‘భూత శుద్ధి వివాహం’ చేసుకుని పెళ్లి బంధంలో ఒక్కటయ్యారు. వివాహానికి సంబంధించిన ఫోటోలు బయటకు రాగానే, అవి సోషల్ మీడియాలో గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారాయి.


ఇప్పటికే పెళ్లి హంగామా ముగియకముందే, సమంత–రాజ్ హనీమూన్‌కి ఎక్కడికి వెళ్తున్నారు? అనే చర్చ నెట్టింట్లో మొదలైంది. ఒకటి కాదు రెండు  ప్రదేశాల పేర్లు గట్టిగా వినిపించడం ఆసక్తికరంగా మారింది.అప్పట్లో నాగ చైతన్యతో పెళ్లి అయిన వెంటనే సమంత లండన్‌కి హనీమూన్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం సమంత పూర్తి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. స్పిరిచువాలిటీ, యోగా, ధ్యానం పట్ల సమంతకు ఉన్న పట్టు అందరికీ తెలిసిందే. అదే కారణంగా, ఈసారి ఆమె రిషికేష్‌నే మొదటి హనీమూన్ డెస్టినేషన్‌గా నిర్ణయించుకుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సమంత-రాజ్ నిడమూరు ఇప్పటికే ఒకసారి రిషికేష్‌కి కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి పాజిటివ్ ఎనర్జీ, ఆధ్యాత్మిక వాతావరణం సమంత మనసులో పెద్ద మార్పు తీసుకువచ్చిందని, అదే కారణంగా రెండో పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం మరింత బలపడిందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అందుకే పెళ్లి అయిన వెంటనే మళ్లీ అక్కడికే వెళ్లాలని సమంత కోరుకుంటుందట.



ఇక రిషికేష్ తర్వాత హనీమూన్‌ను యూరప్‌లో కొనసాగించాలని రాజ్–సమంత ప్లాన్ చేస్తున్నారన్న రూమర్లు కూడా పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి. ఏదేమైనా, ఈ రెండు ప్రదేశాలపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా… సోషల్ మీడియాలో మాత్రం వీరి హనీమూన్ డెస్టినేషన్లపై చర్చలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి.వీరిద్దరి నుంచి ఎప్పుడెప్పుడు కన్‌ఫర్మేషన్ వస్తుందా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: