సమంత కొత్త ట్రెండ్!
టాలీవుడ్‌లో దాదాపు 15 సంవత్సరాలుగా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత (Samantha).. ఈ ట్రెండ్‌లో చేరడం ఇప్పుడు హాట్ టాపిక్. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత, ప్రస్తుతం ‘ఫ్యామిలీ సిరీస్’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరును (రాజ్ & డీకేలో ఒకరు) సమంత పెళ్లి చేసుకుందని తాజా సమాచారం. సినిమా మేకింగ్ వెనుక ఉన్న టెక్నికల్ పవర్ తెలిసిన డైరెక్టర్‌ను జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం ద్వారా, కెరీర్‌కు మరింత బలం చేకూరుతుందని ఈ హీరోయిన్లు నమ్ముతున్నట్టు కనిపిస్తోంది.
గతంలో కూడా తెలుగు, తమిళ పరిశ్రమల్లో తమ కెరీర్‌ను బలంగా, సుదీర్ఘంగా నిలబెట్టుకున్న చాలామంది హీరోయిన్లు దర్శకులనే పెళ్లి చేసుకున్నారు.కుష్బూ - సుందర్ సి: ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌ను ఏలిన కుష్బూ.. తమిళ్‌లో సూపర్‌హిట్ దర్శకుడు అయిన సుందర్ సిని పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉన్నారు. ఈ దర్శకుడి బలంతోనే కుష్బూ ఇండస్ట్రీలో ఇప్పటికీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రోజా - సెల్వమణి: ఒకప్పుడు మాస్ హీరోయిన్‌గా టాప్ స్టార్ హీరోలందరితో నటించిన రోజా.. తన కెరీర్ పీక్ స్టేజ్‌లోనే డైరెక్టర్ సెల్వమణిని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత ఆమె పాలిటిక్స్‌లోనూ రాణించగలిగారు.
రమ్యకృష్ణ - కృష్ణవంశీ: మెగాస్టార్, కింగ్ వంటి అగ్ర హీరోలతో నటించిన రమ్యకృష్ణ.. ‘నిన్నే పెళ్ళాడుతా’, ‘ఖడ్గం’ వంటి మాస్ సినిమాలు తీసిన స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఇప్పటికీ ఇండస్ట్రీలో పవర్ ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నారు.
బాలీవుడ్‌లో సైతం రాణీ ముఖర్జీ (ఆదిత్య చోప్రా) ఈ జాబితాలో ఉన్నారు. ఈ హీరోయిన్లందరూ తమ కెరీర్‌ను 20 సంవత్సరాలకు పైగా కాపాడుకోగలిగారంటే, దాని వెనుక ఉన్న ఆ ‘దర్శక బలం’ కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. అందుకే వీరు కేవలం హీరోయిన్లే కాదు, సక్సెస్‌ఫుల్ లేడీ పవర్ హౌస్‌లు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి