నిర్మాతలకు భారీ ‘నష్ట’ భయం!
ఈ రెండు చిత్రాల బడ్జెట్‌లు ఆకాశాన్ని తాకడం, ఆ తర్వాత వచ్చిన రాబడి పెట్టుబడిని కూడా అందుకోలేకపోవడం వలన.. ఈ ప్రాజెక్టులు నిర్మాతలు, పంపిణీదారులకు భారీ నష్టాలను మిగిల్చాయి. దీంతో, ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి క్యూ కట్టిన హీరోలు, నిర్మాతలు సైతం ఇప్పుడు వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. ఈ చేదు అనుభవం శంకర్‌కు ఒక ‘స్ట్రోక్’ లా తగిలిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
‘వేల్పారి’తోనే కంబ్యాక్!
అయితే, ఈ పరాజయాలు, ఆర్థిక నష్టాలు శంకర్ గారి దృష్టిలోంచి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘వేల్పారి’ (Velpari)ని మాత్రం దూరం చేయలేకపోయాయి. ఇది తమిళ వీరుడు వేల్పరి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోయే చారిత్రక యుద్ధ చిత్రం. ఈ ప్రాజెక్ట్‌ను శంకర్ తన చిరకాల కోరికగా భావిస్తున్నారు.శంకర్ ఈ ప్రాజెక్ట్‌ను సుమారు రూ. 1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో, రెండు భాగాలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. గత సినిమాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి బడ్జెట్, షూటింగ్ విషయంలో ఏమాత్రం లోపం లేకుండా, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను చాలా గోప్యంగా, సైలెంట్‌గా మొదలుపెట్టారని సమాచారం.
ప్రస్తుతానికి, ఇంత భారీ ప్రాజెక్ట్‌కు పెట్టుబడి పెట్టే నిర్మాణ సంస్థ ఏది, వేల్పరి పాత్రలో నటించబోయే అగ్ర హీరో ఎవరు అనే వివరాలను శంకర్ చాలా గోప్యంగా ఉంచారు. ఒకవేళ ఆయన ఈసారి బడ్జెట్, సమయం విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తే.. ‘వేల్పారి’ అనేది ఆయనకు కేవలం కంబ్యాక్ ఇవ్వడమే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో మరో చారిత్రక అధ్యాయంగా నిలిచిపోవడం ఖాయం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి