అల్లు అర్జున్–లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌పై ఇప్పటికే పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్ ఒకటి వేగంగా రూపుదిద్దుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు ఊదరగొడుతున్నాయి. తాజాగా వెలువడిన వార్తల ప్రకారం, లోకేష్ కనగరాజ్ ఐకానిక్ హాలీవుడ్ కామిక్స్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన DC కామిక్స్ నుండి 1962లో ప్రచురితమైన ‘ది స్టీల్ క్లా’ అనే క్లాసిక్ కామిక్ ఆధారంగా ఒక కాన్సెప్ట్‌ను అల్లు అర్జున్‌కు నేరేట్ చేసినట్టు తెలుస్తోంది.


ఈ కామిక్ కథానాయకుడి పాత్ర అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఓ ప్రమాదంలో తన ఎడమ చెయ్యిని కోల్పోయిన ఆ వ్యక్తికి శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన ఇనుప చేయి (స్టీల్ ఆర్మ్) అమర్చుతారు. అయితే ఆ తర్వాత అతని జీవితంలో సంభవించిన ఒక ఊహించని శాస్త్రీయ ప్రమాదం కారణంగా అతనిలో ఒక అసాధారణ శక్తి కలుగుతుంది. అది ఏమిటంటే—అతను తన శరీరాన్ని పూర్తిగా మాయమయ్యే స్థితిలోకి మార్చుకోగలడు, అంటే అతను కనబడకుండా ఉండగలడు. అయితే, విస్మయకరంగా అతని ఇనుప చేయి మాత్రం మాయం కాదని, అదే ఈ పాత్రలోని ప్రత్యేకత, సస్పెన్స్, డ్రామా అన్నీ పుట్టుకొచ్చే మూలం.



ఇలాంటి ఘనమైన నేపథ్యంతో, యాక్షన్‌, సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లింగ్ అంశాలు నిండిన కథను లోకేష్ కనగరాజ్ తన స్టైల్‌కు తగ్గట్టుగా మార్చి, అల్లు అర్జున్‌కు నేరేట్ చేశాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో పాన్‌–ఇండియా కాకుండా గ్లోబల్ స్థాయిలో కూడా అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఇలాంటి ఇంటర్నేషనల్ స్కేల్ ప్రాజెక్ట్ అతనికి సరిపోయేలా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు.



అయితే, ఈ ప్రాజెక్ట్ నిజంగా ఫ్లోర్ మీదికి వస్తుందా? ఇందుకు కావాల్సిన కామిక్ హక్కులు (రిట్స్) నిర్మాతలు అధికారికంగా సంపాదించారా? అల్లు అర్జున్ ఈ కథకు ఓకే చెప్పాడా? లేదా ఇంకా చర్చలు కొనసాగుతున్నాయా? అనే విషయాలు మాత్రం ఇప్పటికీ అధికారికంగా బయటకు రాలేదు. లోకేష్–అల్లు అర్జున్ కాంబోలో ఒక భారీ యాక్షన్ యూనివర్స్ తయారయ్యే ఛాన్స్ ఉందనే బజ్ ఇండస్ట్రీలో నడుస్తున్నా, తుది క్లారిటీ మాత్రం రాబోయే రోజుల్లో మాత్రమే తెలుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.



మొత్తానికి, ‘ది స్టీల్ క్లా’ ఆధారంగా అల్లు అర్జున్ హీరోగా రూపొందే సినిమా నిజమైతే, ఇది భారతీయ సినీ పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్‌కు నాంది పలికే అవకాశముందని చెప్పచ్చు. అభిమానులు ఈ వార్తలపై ఫుల్ ఎగ్జైట్ అయిపోయినా, అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ మొత్తం ప్రాజెక్ట్‌ పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: