గత కొద్ది రోజులుగా భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశంగా మారింది “వర్కింగ్ అవర్స్” విషయం. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ అంశం అగ్గిని రగిలించింది. పలు ఈవెంట్స్‌, ఇంటర్వ్యూల సందర్భాల్లో దీపికా.. హీరోలు ఎంతకాలంగా రోజుకు కేవలం 8 గంటల పని మాత్రమే చేస్తున్నారనీ, నటీమణులకు కూడా అదే వర్తింపజేయాలని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండస్ట్రీ మొత్తంలో ఇది హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది నటీనటులు దీపికా అభిప్రాయాలను సమర్థించగా, మరికొందరు మాత్రం ఆమె అభిప్రాయాలకు పూర్తిగా వ్యతిరేకంగా స్పందించారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.ఇప్పుడేమో ఈ చర్చలోకి టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కూడా ప్రవేశించాడు. తాజాగా ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానాను ఇదే ప్రశ్న అడిగినప్పుడు, ఆయన తనదైన సీరియస్–హ్యూమరస్ మిక్స్ స్టైల్లో దీపికాకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.


రానా మాట్లాడుతూ —“నటన అనేది ఉద్యోగం కాదు, ఇది ఒక లైఫ్‌స్టైల్. సెలబ్రిటీగా ఉన్న తర్వాత, ఈ జీవనశైలిని మనం అంగీకరించాలి. పని గంటలు 8, 10, 12 అని ఎవరో నిర్ణయించరు. నటుడు ఈ ప్రయాణాన్ని ఇష్టపడి చేపడితేనే ఈ ఫీల్డ్‌లో నిలబడగలరు. యాక్టింగ్ అనేది కేవలం కెమెరా ముందు కొన్ని గంటలు నిలబడి డైలాగులు చెప్పడం కాదు… మొత్తం ప్రాజెక్ట్‌లో ప్రతి విభాగానికి నటీనటులు భాగస్వాములవుతారు. పెద్ద పెద్ద సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగ మయమైన సీన్లు అని "పేర్కొన్నాడు.



దీపికా సూచించిన 8 గంటల వర్క్ రూల్ పై ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. రానా ఇచ్చిన ఈ కౌంటర్ అభిమానులని కూడా ఆకట్టుకుంది. కొందరు “ఇదే అసలైన ఆర్టిస్ట్ మాట”, “రానా బుల్లెట్ పాయింట్స్‌లో క్లారిటీ ఇచ్చాడు” అంటూ రియాక్ట్ అవుతున్నారు. ఇక మరోవైపు, దీపికా వ్యాఖ్యలు, రానా స్పందన— ఇవి ఇద్దరివారి దృష్టికోణాలను ప్రతిబింబించినప్పటికీ, ఇండస్ట్రీ లోపలి వర్క్‌ కల్చర్‌ పై కొత్త చర్చను మొదలుపెట్టింది అనేది నిజం. వర్క్ అవర్స్ రూల్స్ పాటించాలా? లేక సినిమాకు ప్యాషన్‌గా అవసరమైనంత పని చేయాలా? ఈ చర్చ రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: