తాము ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన అక్షయ్ కుమార్ తో ఒక ప్రాజెక్టును మాత్రమే కన్ఫామ్ చేశామని తెలియజేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ అనీస్ బజ్మీ దర్శకత్వం వహించబోతున్నారని , ఇందుకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నటీనటుల ఎంపిక కోసం సన్నాహాలు చేస్తున్నామంటూ తెలిపారు. దయచేసి ఎవరూ కూడా మా వైపు నుంచి ఎలాంటి అధికార ప్రకటన లేకుండా ఏలాంటి రూమర్స్ ని వైరల్ చేయవద్దు తప్పుడు వార్తలను , సొంత అంచనాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆపాలని ప్రేక్షకులను కోరుతున్నామంటూ తెలిపారు.
సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను కూడా త్వరలోనే మేము మీతో పంచుకుంటామంటూ దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక నోట్ విడుదల చేశారు. గత కొంతకాలంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, పవన్ కళ్యాణ్ , దిల్ రాజు బ్యానర్ పై ఒక సినిమా రాబోతోందని వార్తలు వినిపించాయి. ఈ చిత్రం మెసేజ్ తో పాటుగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని పవన్ కళ్యాణ్ డేట్ కూడా ఇచ్చారని ప్రచారం అయితే జరిగింది. ఈ విషయానికి సంబంధించి దిల్ రాజు టీమ్ ప్రకటనలో చెప్పకపోవడంతో వీరి కాంబినేషన్లో సినిమా లేదని తెలిసిపోతోంది. ఈ విషయం అటు పవన్ కళ్యాణ్ అభిమానుల నిరాశకు గురిచేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి