జాతీయ అవార్డు విన్నర్: రేఖ 200లకు పైగా సినిమాల్లో నటించింది. 1982లో ‘ఉమ్రాన్ జాన్’ చిత్రానికిగాను ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది. అలాగే, 2010లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.తెలుగు కనెక్షన్: ఆమె దివంగత నటుడు జెమిని గణేషన్, పుష్పవల్లి దంపతులకు జన్మించారు. 1958లో తెలుగులో ‘ఇంటి గుట్టు’ సినిమాతో బాలనటిగా కెరీర్ ప్రారంభించారు.
రూ. 100 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్ల కలెక్షన్!రేఖ 100 కోట్ల విలువైన బంగ్లాలో నివసిస్తుంది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఈ ఇంటి ఖరీదు కూడా ఒకప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె కార్ల కలెక్షన్ కూడా చాలా లగ్జరీగా ఉంటుంది:రోల్స్ రాయిస్ ఘోస్ట్: దీని విలువ దాదాపు రూ. 6 కోట్లు.మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్: దీని విలువ సుమారు రూ. 2.17 కోట్లు.బిఎమ్‌డబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్: దీని ధర రూ. 2.03 కోట్లు.
సినిమాల్లో నటించకపోయినా, రేఖ సంపాదనకు ప్రధాన మార్గం.. ఆమె ప్రత్యేక అతిథిగా హాజరయ్యే అవార్డు షోలు, రియాల్టీ షోలు. ఈ వేడుకలకు ఆమె లక్షల్లో పారితోషికం తీసుకుంటారు. అలాగే, కొన్ని ప్రకటనల బ్యానర్‌లపై తన ఫోటో ప్రదర్శించడానికి కూడా ఆమె రూ. 10 లక్షల వరకు వసూలు చేస్తుందంటే.. ఆమె క్రేజ్ పవర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి