డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రీమియర్ షోలు పడబోతున్నాయని నిర్మాతలు సైతం తెలియజేశారు. అఖండ 2 నిర్మాతలు, తమ స్నేహితులతో పాటు బాలకృష్ణ, బోయపాటి, స్నేహితులు మరికొంతమంది సినీ పెద్దలు సైతం అఖండ 2 సినిమా చూడడం జరిగింది .అనంతరం ఈ సినిమా టాక్ ని తెలియజేసినట్లు సమాచారం. వారు తెలిపిన టాక్ ప్రకారం.. అఖండ 2 చిత్రం 2 గంటల 46 నిమిషాల వరకు ఉన్నది. విలన్ ఎంట్రీ తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత సినిమా అనంతపూర్ కి షిఫ్ట్ అవ్వడం అక్కడ మురళీకృష్ణ ఫ్యామిలీ పరిచయం కావడం , ఆ వెంటనే జాజికాయ సాంగ్ వంటివి వస్తాయి..
అఘోర పాత్ర ఎంట్రీ పెద్ద యాక్షన్ ఎపిసోడ్ తోనే చిత్రీకరించారు డైరెక్టర్. అఘోర ధర్మాన్ని కాపాడడం కోసం ఏం చేశారనేది హైలైట్ గా చూపించారు. ఇంటర్వెల్ తో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని ,మొత్తం మీద ఫస్ట్ ఆఫ్ అయితే అదిరిపోతుందని సెకండ్ హాఫ్ లో తల్లి సెంటిమెంట్ ,పాప సెంటిమెంటుతో మరింత ఎమోషనల్ గా ఆకట్టుకుంటుందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య చెప్పే డైలాగ్స్, ఫైట్స్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంటాయట. టెర్రరిస్టుల మీద బాలయ్య దాడి చేసే సీన్ హైలెట్ ఉంటుందట. క్లైమాక్స్లో ఇద్దరు బాలయ్యలు చేసే ఫైట్ విరోచితంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. మొత్తానికి బాలయ్య ఈ సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంటున్నారని వాళ్లు చెబుతున్నారు.సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా, ఆది పినిశెట్టి విలన్ గా, జగపతిబాబు, పూర్ణ వంటి వారు కీలకమైన పాత్రలో నటించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి