నందమూరి అభిమానులు ఉర్రూతలూగించే మరో వార్త ఇండస్ట్రీలో మాస్ చర్చకు తెరలేపింది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 5న విడుదలవుతున్న తరుణంలోనే, ‘అఖండ 3’ టైటిల్‌పై సంచలన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఫ్రాంచైజీని కొనసాగించాలనేది బాలయ్య, బోయపాటిల పక్కా ప్లాన్ అని తెలుస్తోంది.


క్లైమాక్స్ కార్డ్‌లో బిగ్ రివీల్!

సాధారణంగా సీక్వెల్స్‌, ప్రీక్వెల్స్ టైటిళ్లను విడుదలైన సినిమా క్లైమాక్స్‌లో ‘క్లైమాక్స్ కార్డ్’ రూపంలో చూపించడం ట్రెండ్‌గా మారింది. సరిగ్గా ఇదే తరహాలో ‘అఖండ 2: తాండవం’ క్లైమాక్స్‌లో కూడా పార్ట్ 3 గురించి రివీల్ చేయబోతున్నారని సమాచారం.ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఒక ఫోటో మాస్ వైరల్ అవుతోంది. ‘అఖండ 2’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగించుకున్న చిత్రబృందం... సంగీత దర్శకుడు ఎస్. థమన్ రికార్డింగ్ స్టూడియోలో ఉన్న ఒక ఫోటోను విడుదల చేసింది. ఆ ఫోటోలో, వెనుక స్క్రీన్‌పై ‘జై అఖండ’ అనే అక్షరాలు స్పష్టంగా కనిపించాయి.


ఈ ‘జై అఖండ’ అనే అక్షరాలను చూసిన నందమూరి అభిమానులు.. ‘అఖండ 3’ టైటిల్ ఇదేనని దాదాపు ఫిక్స్ అయ్యారు. ఈ టైటిల్ మాస్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉండటంతో పాటు, గతంలో బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన ‘సింహా’ సినిమా హిట్టయ్యాక, ‘జై సింహా’ అనే సినిమా రావడం, అది కూడా మంచి విజయం సాధించడం ఒక ‘సెంటిమెంట్’గా ఉంది. అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు ‘జై అఖండ’ టైటిల్ ఫిక్స్ చేసి ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.పైగా, ‘అఖండ’ టైటిల్ సాంగ్‌లో కూడా ‘జై అఖండ’ అనే పదం పలుమార్లు వినిపిస్తుంది. ఈ అన్ని కోణాల నుంచి చూస్తే, ‘జై అఖండ’ అనేది ఈ మాస్ ఫ్రాంచైజీకి పర్ఫెక్ట్ టైటిల్ అని అభిమానులు భావిస్తున్నారు.


మొత్తానికి, ‘అఖండ 2: తాండవం’ విడుదలకు ముందే, పార్ట్ 3 టైటిల్‌పై ఇంతటి హైప్ క్రియేట్ అవ్వడం.. ఈ ‘అఖండ’ బ్రాండ్‌కు ఉన్న మాస్ పవర్ను మరోసారి నిరూపిస్తోంది!


మరింత సమాచారం తెలుసుకోండి: