మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ . ఈ సినిమా పై జనాలు ఎన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారో అందరికి తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో మాత్రమే కాదు, ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి హైప్ నెలకొంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనుండటం మరింత ఆసక్తిని పెంచింది.


తాజాగా వెంకటేష్ ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్లు వెల్లడిస్తూ ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. ఈ సినిమా తనకు ఒక ‘ఇంక్రెడిబుల్ ఎక్స్‌పీరియన్స్’ ఇచ్చిందని, ముఖ్యంగా తన ఫేవరెట్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం ఈ ప్రాజెక్ట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చిందని తెలిపారు. చాలాకాలంగా చిరంజీవితో కలిసి నటించాలని తన మనసులో ఉన్న కోరిక ఈ సినిమాతో నెరవేరిందని, ఆ అవకాశాన్ని కల్పించిన దర్శకుడు అనిల్ రావిపూడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.



చిరంజీవితో పని చేసిన ప్రతి రోజు తనకు మరపురాని జ్ఞాపకాలు మిగిల్చిందని, సెట్స్‌పై ఉన్న కెమిస్ట్రీ, వర్కింగ్ ఎన్విరాన్‌మెంట్, ఫన్ మూమెంట్స్ అన్నీ కలిపి ఈ ప్రయాణాన్ని ఎంతో అందంగా మార్చాయని వెంకీ పేర్కొన్నారు. సంక్రాంతి సెలబ్రేషన్‌కు కుటుంబాలతో కలిసి థియేటర్లలో ఈ సినిమాను చూడడానికి ఎదురు చూస్తున్నానని, ప్రేక్షకులు కూడా తప్పకుండా ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పొందబోతున్నారని చెప్పారు. వెంకీ చేసిన పోస్ట్‌ వైరల్ అవుతుంది.అయితే త్రివిక్రమ్ - వెంకీ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో చిరు గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నాడట. దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ త్వరలోనే వింటాం అంటున్నారు జనాలు..!



మరింత సమాచారం తెలుసుకోండి: