తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒకే ఒక్క ‘మాస్ ఇమేజ్’ ఫార్ములాకు ఇప్పుడు యంగ్ హీరోలు దండం పెడుతున్నారు! స్టార్‌డమ్ సంపాదించాలంటే తప్పనిసరిగా యాక్షన్, ఫైట్లు, రొటీన్ ట్రాక్ ఉండాలనే పాత సిద్ధాంతాన్ని పక్కన పెడుతూ.. ‘సక్సెస్’ ఒక్కటే చాలు అనే కొత్త మానియాకు ఈ తరం హీరోలు స్వాగతం పలికారు. రొటీన్ మాస్ ట్రాక్‌కు దూరంగా, కంటెంట్‌ను నమ్ముకుని, కొత్త ప్రయోగాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ మాస్ ట్రెండ్ రిపోర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


‘మాస్ ట్రాక్’ నుంచి పక్కదారి!

గతంలో, యాక్షన్ హీరోలుగా ప్రయత్నించి రొటీన్ ట్రాక్‌లో ఇరుక్కున్న యువ హీరోలు ఇప్పుడు కథా కథనంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. దీనికి నిదర్శనం:నిఖిల్ మాస్ రీబౌండ్: మాస్ ట్రాక్‌ ఎక్కి కొన్నాళ్లు పట్టాలు తప్పిన నిఖిల్, రొటీన్ నుంచి బయటపడాలని ప్రయత్నించి.. ‘కార్తికేయ 2’తో ఏకంగా పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ మూవీ ‘స్వయంభు’ చరిత్రలోకి వెళ్లిపోయి, పీరియాడిక్ మూవీస్ వైపు మొగ్గు చూపడం ఈ కొత్త ట్రెండ్‌కు పరాకాష్ట.



ఆనంద్ దేవరకొండ రిస్క్: అన్న విజయ్ దేవరకొండలా కాకుండా, తమ్ముడు ఆనంద్ దేవరకొండ పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వస్తున్నాడు. ‘బేబి’ తర్వాత, వైష్ణవి కాంబోలో ‘ఎపిక్’ అనే సినిమాతో రాబోతున్న ఆనంద్.. మాస్ జోలికి పోకుండా కొత్త కథలను ట్రై చేస్తూ, కంటెంట్ ఓరియెంటెడ్ హీరో అని అనిపించుకుంటున్నాడు.నేటి యువ హీరోలు కేవలం ఫైటింగ్‌లకే పరిమితం కాకుండా, విభిన్న జానర్లను, క్యారెక్టర్ డ్రైవెన్ సబ్జెక్టులను ఎంచుకుంటున్నారు:



శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్: హీరో శర్వానంద్ పూర్తిగా సిక్స్‌ ప్యాక్‌తో గుర్తుపట్టలేనంతగా మారి, ‘బైకర్’ పాత్రలో కనిపించబోతున్నాడు. మాస్ నుంచి ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర వైపు మారడం ఈ ట్రెండ్‌కు నిదర్శనం.నందు నెగెటివ్ షేడ్: హీరో నందు.. అర్జున్ రెడ్డిలా నెగెటివ్ షేడ్‌లో ‘సైక్ సిద్దార్థ్గా కనిపించబోతున్నాడు. ఇది కూడా మాస్‌కు దూరంగా, బలమైన క్యారెక్టర్‌ను ఎంచుకోవడమే.



తెలుగు యువ హీరోలు ఇప్పుడు కేవలం ఇమేజ్ కోసం కాకుండా, కథా బలమున్న కొత్త ప్రయోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కొత్త రూటే వారికి సుస్థిరమైన స్టార్‌డమ్‌ను అందిస్తుందనే నమ్మకంతో ఇండస్ట్రీ ఉంది!

మరింత సమాచారం తెలుసుకోండి: