కేవలం కొద్దిగంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొద్ది గంటల్లోనే  ధియేటర్స్ లల్లో ఓ సెన్సేషన్ రాబోతుంది.  అభిమానుల కోసం బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ సినిమాను థియేటర్లలో చూడడానికి అంత సిద్ధమైంది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటే అభిమానులకు ఎప్పుడూ వేరే లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇచ్చే పట్టు ఉంటుంది. పైగా ఈ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అఖండ కి సీక్వెల్‌గా రాబోతూ ఉండట, మరింత ఉత్కంఠను సృష్టిస్తోంది.


ఇది ఇంకా ఇంకా ప్రత్యేకంగా మరింత ఆకట్టుకునే అంశం అనే చెప్పాలి.  సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ కథను మరింత రుచికరంగా మార్చే అంశంగా మారింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, మాసివ్ టీజర్ అన్నీ అభిమానులను ఒక ప్రత్యేక స్థాయిలో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, ధమన్ సంగీతం ప్రేక్షకులందరినీ గూస్ బంప్స్ తో నింపినట్టే ఉంది.  థియేటర్లలో ఆయన సంగీతాన్ని విన్నప్పుడు ప్రేక్షకులకు ప్రత్యేకమైన, వేరే లెవెల్ ఫీలింగ్ వస్తుందని చెబుతున్నారు.ఇప్పటికే థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్ హంగామ మొదలైపోతోంది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పూల దండాలు, పాలాభిషేకాలతో మొత్తం వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. ఈ సందర్భంలో, ‘అఖండ 2’ ప్రమోషన్ కోసం ప్రతి బాలయ్య ఫ్యాన్ సినిమా పోస్టర్‌ని డిపి గా పెట్టి స్టేటస్‌లో పెట్టాలి అని డిమాండ్ చేస్తూ, ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేస్తున్నారు.



బాలయ్య అంటే వేరే రేంజ్ ఆఫ్ మాస్ అని చెప్పాలి. అలాగే, మాస్ మూవ్‌మెంట్స్ తో ఫ్యాన్స్ అఖండ 2 పై సెన్సేషన్ సృష్టిస్తూ, సినిమాలోని ప్రతీ ఘట్టాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఉత్సాహభరిత వాతావరణంలో, కొద్దిగంటల్లోనే  ‘అఖండ 2’ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. బాక్స్ ఆఫీస్‌ను ఖచ్చితంగా కదిలిస్తుంది ఈ సినిమా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఈ సినిమా అభిమానులను ఎలా ఆకట్టుకుంటుంది అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోబోతుంది.  ఇప్పటికే టీజర్, ట్రైలర్, మ్యూజిక్, ఫ్యాన్స్ క్రియేషన్ వంటి అంశాలు చూస్తే, సినిమా ప్రేక్షకులను కట్టిపడే మాస్ ఎంటర్టైన్‌మెంట్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: