ఇటీవలి రోజుల్లో ఈ జంట ఇషా ఫౌండేషన్‌లో జరిగిన ‘భూతశుద్ధి’ విధానం లో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడం మరింత సందేహాలకు కారణమైంది. దీంతో సమంత, రాజ్ నిడమూరు లపై నెటిజన్ల దృష్టి ఎక్కువుగా ఉంది. అయితే సమంత క్రిస్టియన్ మతానికి చెందినవారైనందున, ఆమె రెండో పెళ్లి కూడా క్రిస్టియన్ పద్ధతిలో జరుగుతుందేమో అని అభిమానులు, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త ప్రకారం — సమంత క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి చేసుకోకూడదని రాజ్ నిడమూరు స్పష్టమైన కండిషన్ పెట్టారట.
దీనికి కారణం కూడా ఉందంటున్నారు. రాజ్ నిడమూరు తల్లిదండ్రులు, ముఖ్యంగా వారి కుటుంబ పెద్దలు హిందూ సంప్రదాయాలను గట్టిగా ఆచరించే కుటుంబం. అలాగే ప్రసిద్ధ గాయని శోభా రాజు ఈ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు. ఆమె హిందూ భక్తి సంప్రదాయాన్ని ఎంతగానో గౌరవిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం, హిందూ సంప్రదాయాలు, భక్తి పరంపరలపై ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కూడా తరచూ వార్తల్లోకి వస్తుంటాయి.ఇలాంటి నేపథ్యానికి చెందిన కుటుంబంలో, శోభా రాజు అక్క కొడుకు అయిన రాజ్ నిడమూరు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం కుటుంబం ఆమోదించదని, అందుకే సమంతకు హిందూ సంప్రదాయంలోనే వివాహం జరగాలని షరతు పెట్టారన్న వార్తలు సోషల్ మీడియాలో విస్తరంగా ప్రచారం అవుతున్నాయి.
ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో ఇప్పటికీ అధికారికంగా వెల్లడికాగపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం పెద్ద దుమారం రేపుతోంది. కొంతమంది బాగా తిక్క కుదిరింది సమంతకి అంటున్నాతు. సమంత, రాజ్ నిడమూరు ప్రేమ, వివాహం, ఆచారాల విషయంలో వస్తున్న ప్రతి అప్‌డేట్‌పై అభిమానులు ఆసక్తిగా కన్నేసి చూస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత? అసలు నిజం బయటకు వచ్చే వరకు ఈ రూమర్లు సోషల్ మీడియాలో మరింత వేగంగా వ్యాపించే అవకాశం కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి