ఇప్పటికే ఎక్కడ చూసినా సమంత రెండో పెళ్లి వార్తలు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా అంతా దూసుకెళ్తున్నాయి. విడాకుల తరువాత సమంత ఇచ్చిన స్టేట్మెంట్లు, ఆమె జీవనశైలి మార్పులు చూసి చాలా మంది ఆమె ఇక మళ్లీ పెళ్లి గురించి ఆలోచించదు అనుకున్నారు. ప్రేమ, వివాహం అనే మాటలకు ఆమె దూరంగా ఉంటుందని అభిమానులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. అయితే అందరి అంచనాలకు పూర్తిగా విరుద్ధంగా, ఎవరూ ఊహించని రీతిలో, దర్శకుడు రాజ్ నిడమోరుని ప్రేమించి, డిసెంబర్ 1న సమంత రెండో పెళ్లి చేసుకోవడం అన్ని వర్గాల ప్రజలను ఆశ్చర్యపరిచింది.


వివాహం జరిగిన రోజునుంచే వచ్చిన అసలు ఫోటోలు, వీడియోగ్రఫీ స్టిల్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే దీనితో పాటు ఏఐ సృష్టించిన నకిలీ ఫోటోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ఈ పెళ్లికి హాజరయ్యాడని చూపించే ఒక ఫేక్ వీడియో కూడా తీవ్రంగా ట్రెండ్ అయ్యింది. ఈ వీడియోను నమ్మి కొంతమంది నిజంగానే జరిగిందని భావించి కామెంట్లు చేయడం కూడా జరిగింది.కానీ ప్రస్తుతం అన్ని వాటిని మించిన మరో ఏఐ పిక్ సోషల్ మీడియాలో భీకరంగా వైరల్ అవుతోంది. అది సమంతరాజ్ నిడమోరు లిప్‌లాక్ చేస్తున్నట్లు కనిపించే ఫోటో. సమంత పెళ్లి పిక్స్ ని ఏఐ ని ఉపయోగించి ఈ విధంగా క్రియేట్ చేసి నెట్‌లో రిలీజ్ చేశారు. వెంటనే అది అన్ని ప్లాట్‌ఫార్ముల్లో స్పీడ్‌గా ట్రెండ్ అయ్యింది.



ముఖ్యంగా, గతంలో రాజ్ నిడమోరు తన మొదటి భార్యతో ఉన్న ఫోటోను తీసుకుని, ఇప్పుడు సమంతతో “ఇలా కిస్ పెట్టుకున్నాడు” అంటూ పోలికలు చూపిస్తూ మరికొందరు ఈ ఏఐ పిక్‌ను వైరల్ చేశారు. ఈ ఫేక్ పోలిక పోస్టులు చూసి కొంతమంది నెటిజన్లు నిజంగానే ఇది ఒరిజినల్ ఫోటో అనుకుని షాక్ అయ్యారు. “అప్పుడే ఇంత బరితెగింపు ఏమిటి?” అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.తరువాత ఇది అసలు ఫోటో కాదని, కేవలం ఏఐ జనరేట్ చేసిన నకిలీ పిక్ అని తెలిసిన షాక్ అవుతున్నారు.  అయినా సోషల్ మీడియాలో ఈ పిక్ దుమారం మాత్రం తగ్గడం లేదు. నిజ-నకిలీ చూడకుండా షేర్ చేసే అలవాటు వల్ల ఇలాంటి ఫేక్ కంటెంట్ ఒక్కసారిగా వైరల్ అవుతోంది. మొత్తానికి, సమంత నిజమైన పెళ్లి ఫోటోలు కంటే కూడా ఏఐ సృష్టించిన నకిలీ కిస్సింగ్ పిక్‌కి సోషల్ మీడియాలో ఎక్కువ హడావుడి జరుగుతోంది. ప్రస్తుతం నెటిజన్ల దృష్టంతా దీనిపైనే ఉండటంతో, ఈ పిక్ సోషల్ మీడియాలో అత్యంత వైరల్ టాపిక్‌గా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: