సమంత కొత్త జీవితం.. కొత్త ట్రెండ్!
సమంత-రాజ్‌లు తమ వివాహానికి సంబంధించి మెహందీ, వెడ్డింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఈ పెళ్లి వేడుకలో ఆసక్తికరంగా నిలిచిన అంశాలు:భూతశుద్ధి వివాహం: వీరి వివాహం పూర్తిగా యోగ సంప్రదాయం ప్రకారం ‘భూతశుద్ధి ఆచారం’తో నిరాడంబరంగా జరిగింది. సమంత తన ఆరాధ్య దైవమైన లింగ భైరవి సన్నిధిలో పెళ్లి చేసుకోవడం విశేషం.
రెడ్ సారీలో రాణిలా: వివాహ వేడుకలో సమంత సంప్రదాయ ఎరుపు రంగు చీర కట్టుకుని, చోకర్ నెక్లెస్, భారీ చెవిపోగులతో రాణిలా మెరిసింది. రాజ్ నిడిమోరు కూడా సింపుల్ కుర్తా, పైజామా ధరించి కనిపించారు.వైరల్ మెహందీ: పెళ్లి ఫోటోలతో పాటు సమంత చేతికి పెట్టుకున్న మెహందీ డిజైన్ కూడా వైరల్ అవుతోంది. ఆమె మెహందీలో ఎంతోమంది అభిమానులు, నెటిజన్లు వారి ప్రేమ బంధానికి సంబంధించిన డిజైన్ల కోసం వెతకడం మొదలుపెట్టారు.
స్పెషల్ వెడ్డింగ్ రింగ్: రాజ్ నిడిమోరు సమంతకు తొడిగిన డైమండ్ రింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీర్ఘ చతురస్త్రాకారంలో (Portrait Cut) ఉన్న ఈ ఉంగరాన్ని దీర్ఘాయుష్షు, బలం, స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు.సాత్విక విందు: అతిథులకు అరటి ఆకులో వడ్డించిన సాత్విక భోజనం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈశా ఫౌండేషన్ విలువలకు అనుగుణంగా మసాలాలు లేకుండా, కేవలం దక్షిణ భారతీయ సంప్రదాయ వంటకాలను వడ్డించారు.
అయితే, ఈ పెళ్లి సందర్భంగా రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలీ దే పెట్టిన పరోక్ష పోస్ట్ కూడా నెట్టింట వైరల్ అయ్యింది. బంధాలన్నీ ‘రుణానుబంధం’ అని, రుణం తీరిపోయినప్పుడు ఆ సంబంధాలు ముగిసిపోతాయని ఆమె చేసిన పోస్ట్.. సమంత-రాజ్ పెళ్లి వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది.పెళ్లి తర్వాత కూడా సమంత తన అభిమానులు, శ్రేయోభిలాషులతో ఈ ‘మాస్సివ్’ అప్‌డేట్‌ను పంచుకోవడంతో.. కొత్త జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి